గురువు రాశి మార్పుతో ఈ రాశులకు అనేక లాభాలు.. త్వరలో ధనలాభం, ఉద్యోగాలు ఇలా ఎన్నో!-jupiter transit in karkata rasi these 3 rasis receive wealth jobs and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గురువు రాశి మార్పుతో ఈ రాశులకు అనేక లాభాలు.. త్వరలో ధనలాభం, ఉద్యోగాలు ఇలా ఎన్నో!

గురువు రాశి మార్పుతో ఈ రాశులకు అనేక లాభాలు.. త్వరలో ధనలాభం, ఉద్యోగాలు ఇలా ఎన్నో!

Peddinti Sravya HT Telugu

గురువు వేగంగా కదులుతాడు. గురువు రాశి మార్పు చెందడంతో చాలా రాశుల వారికి కలిసిరాబోతోంది. కర్కాటక రాశిలో గురువు సంచారం ఏ రాశిపై కూడా ప్రభావం చూపుతుందా? మీకు కూడా శుభఫలితాలు ఎదురవుతాయా? కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. గురువు–చంద్రుడు స్నేహితులు. గురువు రాశి మార్పుతో ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది?

గురువు రాశి మార్పుతో ఈ రాశులకు అనేక లాభాలు

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా జరిగినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. అక్టోబర్ నెలలో అతిపెద్ద రాశి మార్పు చోటు చేసుకోనుంది. దేవతల గురువు, దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించడంతో అనేక శుభయోగాలు ఏర్పడతాయి.

గురువు వేగంగా కదులుతాడు. గురువు రాశి మార్పు చెందడంతో చాలా రాశుల వారికి కలిసిరాబోతోంది. కర్కాటక రాశిలో గురువు సంచారం ఏ రాశిపై కూడా ప్రభావం చూపుతుందా? మీకు కూడా శుభఫలితాలు ఎదురవుతాయా? మరి, ఇప్పుడే తెలుసుకోండి.

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. గురువు చంద్రుని రాశిలో ఉన్నప్పుడు శుభఫలితాలు ఎదురవుతాయి. గురువు–చంద్రుడు స్నేహితులు. గురువు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది?

గురువు రాశి మార్పుతో ఈ రాశులకు అనేక లాభాలు

1.కర్కాటక రాశి:

కర్కాటక రాశిలో గురువు ప్రవేశించడంతో ఈ రాశి వారికి మంచి జరగనుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది.

2.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి గురువు సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో పురోగతిని పొందుతారు. వ్యాపార పరంగా కూడా కలిసివస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పిల్లలు ఉన్నవారికి సంతోషం కలుగుతుంది.

3.తుల రాశి:

తుల రాశి వారికి గురువు సంచారంలో మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త ఉద్యోగాలను పొందుతారు. పదోన్నతి లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంతో పాటుగా వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. పాత పెట్టుబడులు కూడా ఎక్కువ లాభాలను తీసుకువస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.