చిలకమర్తి పంచాంగరీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 14 మే 2025 రాత్రి 8.58 నిముషాలకు గురువు మిథునరాశిలోకి ప్రవేశించడం చేత కొన్ని రాశులకు శుభఫలితాలు, కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఏర్పడుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మిథునరాశిలోకి బృహస్పతి మారడం వలన మేష, మిథున, కర్కాటక, వృశ్చిక, మకర రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడునని, వృషభ, కన్య, తుల, ధనుస్సు రాశుల వారికి అనుకూల ఫలితాలు ఏర్పడునని, సింహ, కుంభ, మీన రాశులవారికి మధ్యస్థఫలితాలు ఏర్పడునని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. బృహస్పతి మిధున రాశిలోకి మార్పు చెందడం చేత రాశుల వారీగా ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మేష రాశి: మేష రాశి వారికి కుటుంబ కలహాలు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు ఇబ్బంది పెట్టును. దక్షిణామూర్తిని పూజించండి.
వృషభ రాశి: వృషభ రాశి వారికి ధనము, కీర్తి, సౌఖ్యము కలుగును. కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపెదరు.
మిథున రాశి : ఉద్యోగంలో టెన్షన్లు, వ్యాపారంలో ఒత్తిడులు అధికమగును. అనారోగ్య సమస్యలు, భయాందోళనలు వేధించును. దక్షిణామూర్తిని పూజించండి.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికమగును. ప్రయాణాలు అధికమగును. ఆందోళన పెరుగును. దత్తాత్రేయుని పూజించండి.
సింహ రాశి: సమస్యలు ఎదురైనప్పటికీ అనుకున్నపనులు పూర్తి చేసెదరు. లాభములు కలుగును.
కన్యా రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పు వచ్చి శుభఫలితాలు పొందెదరు. అప్పుల నుండి బయటపడెదరు. కీర్తి కలుగును.
తుల రాశి: అన్ని విధాలుగా అనుకూలముగా ఉన్నది. కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందెదరు. శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఒత్తిడులు పెరుగును. ప్రమాదములు వంటివి సంభవించు సూచన. దక్షిణామూర్తిని పూజించండి.
ధనస్సు రాశి: ధనుస్సు రాశి వారికి కుటుంబంలో శాంతి కలుగును. శత్రు బాధ తొలగును. శుభ ఫలితాలు పొందెదరు.
మకర రాశి: శత్రువుల వల్ల బాధ, పీడ కలుగును. గొడవలు పెరుగును. ఒత్తిళ్ళకు లోనయ్యెదరు. దత్తాత్రేయుని పూజించండి.
కుంభ రాశి : కుంభ రాశి వారికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ మానసిక ధైర్యముతో ముందుకు సాగెదరు. సవాళ్ళను అధిగమించెదరు. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దత్తాత్రేయుని పూజించండి.
మీన రాశి: ఈ రాశి వారికి కాలము కలిసివచ్చును. ముఖ్యమైన పనుల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందెదరు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000