గురువు డబుల్ ధమాకా.. వచ్చే నెలలో ఈ 3 రాశుల వారికి అదృష్టం, ధనంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది!-jupiter star transit twice in july month and it gives luck wealth and health to cancer leo and sagittarius ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గురువు డబుల్ ధమాకా.. వచ్చే నెలలో ఈ 3 రాశుల వారికి అదృష్టం, ధనంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది!

గురువు డబుల్ ధమాకా.. వచ్చే నెలలో ఈ 3 రాశుల వారికి అదృష్టం, ధనంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది!

Peddinti Sravya HT Telugu

గురువు రెండుసార్లు ఒకే నక్షత్రంలో తన స్థానాన్ని మారుస్తాడు. ఇలా రెండుసార్లు గురువు సంచారంలో మార్పు వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. గురు డబుల్ ధమాకాతో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.

గురువు డబుల్ ధమాకా.. వచ్చే నెలలో ఈ 3 రాశుల వారికి అదృష్టం

జూలై నెలలో గురువు రెండుసార్లు ఒకే నక్షత్రంలో తన స్థానాన్ని మారుస్తాడు. ఇలా రెండుసార్లు గురువు సంచారంలో మార్పు వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. గురు డబుల్ ధమాకాతో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ధృక్ ప్రకారం ప్రకారం, గురువు రెండుసార్లు నక్షత్ర మార్పు చెందుతాడు. మొదటగా జూలై 13న ఉదయం 7:30కి ఆరుద్ర రెండవ పాదం నుంచి మూడో పాదంలోకి ప్రవేశిస్తాడు. రెండవసారి జూలై 28న ఉదయం 9:33కి నాలుగో పాదంలోకి మారుతాడు. ఆరుద్ర నక్షత్రానికి రాహువు అధిపతి. గురువు నక్షత్ర మార్పు వలన మూడు రాశుల వారికి అనేక లాభాలు ఉంటాయి. మరి ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

గురువు నక్షత్ర సంచారంలో మార్పులతో ఈ మూడు రాశుల వారికి అనేక లాభాలు:

1.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి గురువు నక్షత్ర మార్పు వలన అనేక లాభాలు ఉంటాయి. గురువు అనుగ్రహంతో ఈ రాశి వారికి అడ్డంకులు తొలగిపోతాయి. ధనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆదాయానికి కొత్త అవకాశాలు వస్తాయి. వివాహితులు సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కమ్యూనికేషన్ కూడా మెరుగుపడుతుంది.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి గురువు నక్షత్రంలో మార్పు వలన అనేక లాభాలు ఉంటాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు కూడా మీ మాట వింటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది.

3.ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి కూడా ఈ సమయం బాగుంటుంది. గురువు మీకు మంచి ఫలితాలని ఇస్తాడు. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.