జూన్ నెలలో గురువు అస్తమయం.. ఈ మూడు రాశులకు ప్రేమ జీవితంలో అనందం, ధనంతో పాటు ఎన్నో!-jupiter set in june month in gemini and these 3 rasis will get lots of wealth and many more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ నెలలో గురువు అస్తమయం.. ఈ మూడు రాశులకు ప్రేమ జీవితంలో అనందం, ధనంతో పాటు ఎన్నో!

జూన్ నెలలో గురువు అస్తమయం.. ఈ మూడు రాశులకు ప్రేమ జీవితంలో అనందం, ధనంతో పాటు ఎన్నో!

Peddinti Sravya HT Telugu

గురు గ్రహం ధనుస్సు, మీన రాశులకు అధిపతి. గురుగ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి ఒక సంవత్సరం పడుతుంది. గురు గ్రహం అస్తమయం అన్ని రాశులనూ ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. అయితే, కొన్ని రాశులు దీని వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఆ రాశులు వారు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జూన్ నెలలో గురువు అస్తమయం

జ్యోతిష శాస్త్రం ప్రకారం, దేవగురువు అయిన గురుగ్రహం ధనుస్సు, మీన రాశులకు అధిపతి. గురుగ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి ఒక సంవత్సరం పడుతుంది. ఆ విధంగా, గురుగ్రహం ఇటీవలే వృషభ రాశి నుండి మిధున రాశిలోకి ప్రవేశించింది.

గురువు మిధున రాశి సంచారం అన్ని రాశులనూ ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో, గురువు జూన్ 9వ తేదీన మిధున రాశిలో అస్తమించబోతోంది. గురువు అస్తమయం అన్ని రాశులనూ ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. అయితే, కొన్ని రాశులు దీని వల్ల అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నాయి. ఆ రాశులు వారు ఎవరో చూద్దాం.

గురువు అస్తమయంతో ఈ మూడు రాశులకు ఎన్నో లాభాలు

1.మేష రాశి

మీ రాశిలో మూడవ భావంలో గురువు అస్తమించబోతున్నాడు. దీని వల్ల మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని చెబుతున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయని చెబుతున్నారు. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయని చెబుతున్నారు. వివాహితుల జీవితంలో ఆనందం పెరుగుతుందని చెబుతున్నారు.

వివాహం కాని వారికి త్వరలో వివాహం జరగవచ్చు. సోదరుల వల్ల మీకు అభివృద్ధి ఉండవచ్చు. ధనయోగం కలగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కోటీశ్వర యోగం మీకు అదృష్టాన్ని ఇస్తుంది.

2.వృషభ రాశి

వృషభ రాశి రెండవ ఇంట్లో గురువు అస్తమించబోతున్నాడు. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. డబ్బుని ఆదా చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు ఉంటుంది. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ధనయోగం ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా మారుతుంది. కోటీశ్వర యోగం కలగవచ్చు. ధనయోగం వల్ల సంతోషం పెరుగుతుంది.

3.మీన రాశి

మీన రాశి నాలుగవ ఇంట్లో గురుగ్రహం అస్తమించబోతున్నాడు. దీని వల్ల మీ కుటుంబంలోని సమస్యలు తగ్గవచ్చు. ఉద్యోగంలో గొప్ప విజయం ఉంటుంది. మంచి ఆర్థిక వనరులను పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ధనయోగం వుంది. కోటీశ్వర యోగం వల్ల సంతోషం ఎక్కువవుతుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.