గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గురువుని బృహస్పతి, దేవగురువు అని పిలుస్తారు. గురువు జ్ఞానాన్ని, అదృష్టాన్ని తీసుకువస్తాడు. గురువు అస్తమించడంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వస్తాయి.
గురువు అస్తమయం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం 26 రోజులు పాటు కష్టాలను తీసుకువస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు 26 రోజులు పూర్తి అవ్వవు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జూన్ 11 నుంచి జూలై 7 వరకు గురువు అస్తమయంలో ఉంటాడు. దీంతో ఐదు రాశుల వారికి కొన్ని రోజులు పాటు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకుని జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ ఇబ్బందులు లేకుండా ముందుగానే చూసుకోండి.
26 రోజులు కర్కాటక రాశి వారికి చిన్నచిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు పని చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిన్నచిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వృషభ రాశి వారికి గురువు అస్తమయంతో చిన్నచిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. డబ్బులు రావడంలో ఆలస్యం కలగడం లాంటివి చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో, ఆర్థిక పరిస్థితుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
వృశ్చిక రాశి వారికి గురువు అస్తమయంతో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఇంట్లో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు చిన్నచిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి వారికి 26 రోజులు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈ సమయంలో కాస్త ఆలోచించి మాట్లాడడం మంచిది. జీవిత భాగస్వామితో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అపార్థాలు కొంత మేరకు నష్టం కలిగే అవకాశం ఉంది.
కుంభ రాశి వారికి గురువు అస్తమయంతో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాస్త తెలివిగా మాట్లాడటం, ఆలోచించి మాట్లాడడం మంచిది. ఇంట్లో ఉన్న వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇలా కుంభ రాశి వారు కూడా ఈ సమయంలో చిన్నపాటి సమస్యలను ఎదుర్కొనవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్