Jupiter rise: ఉదయించిన బృహస్పతి.. దీని వల్ల ఏ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుందో చూసేయండి-jupiter rise in taurus these zodiac signs good luck will shine with kendra trikona raja yogam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Rise: ఉదయించిన బృహస్పతి.. దీని వల్ల ఏ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుందో చూసేయండి

Jupiter rise: ఉదయించిన బృహస్పతి.. దీని వల్ల ఏ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుందో చూసేయండి

Gunti Soundarya HT Telugu
Jun 03, 2024 06:10 PM IST

Jupiter rise: అస్తంగత్వ దశ నుంచి బృహస్పతి జూన్ 3న ఉదయించాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం అండతో మంచి రోజులు మొదలయ్యాయి. అవి ఏ రాశులో చూసేయండి.

ఉదయించి బృహస్పతి
ఉదయించి బృహస్పతి

Jupiter rise: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకే దేవ గురువుగా పిలుస్తారు. వృషభ రాశిలో బృహస్పతి కదలిక మారడం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. జ్ఞానం, సంపద, సంతానం, తోబుట్టువులు, విద్య, మతపరమైన పనులు, పవిత్ర స్థలాలను బృహస్పతి సూచిస్తాడు. 

సంబంధిత ఫోటోలు

పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం ఇదే రాశిలో తన ప్రయాణం సాగిస్తూ తన కదలికలు మాత్రం మార్చుకుంటాడు. అస్తంగత్వ దశలోకి వెళ్ళిన బృహస్పతి జూన్ 3వ తేదీన ఉదయించి రాజయోగం సృష్టించాడు. ఇది కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఇస్తుంది. 

కేంద్ర త్రికోణ రాజయోగం అంటే ఏంటి?

జన్మ చార్ట్ కేంద్ర గృహాలు ఒకటి, నాలుగు, ఏడు, పది… త్రికోణ గృహాలు ఒకటి, ఐదు, తొమ్మిది కలయిక జరిగినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. కేంద్ర త్రికోణ రాజయోగం ఒక వ్యక్తికి శుభంగా భావిస్తారు. జాతకంలో ఈ యోగం ఉంటే అదృష్టాన్ని ఇస్తుంది. కెరీర్ లో పురోగతికి అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నత స్థానాలకు బదిలీ అవడం వంటివి జరుగుతుంది. బృహస్పతి ఉదయించడం వల్ల నాలుగు రాశుల వారికి మేలు జరుగుతుంది. 

మేష రాశి

బృహస్పతి ఉదయించడం మేష రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఆదాయం, ఆర్థిక లాభాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ కాలంలో కొత్త వెంచర్లు ప్రారంభించుకోవచ్చు. మేష రాశి రెండో గురు సంచారం జరుగుతుంది. పర్యవసానంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే విదేశీ ప్రయాణాల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆనందాన్ని కలిగించే విధంగా కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. అంతర్జాతీయ వనరుల నుండి లాభాలకు అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు ఆస్వాదిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి ఉన్న సమస్యలు తీరిపోతాయి. 

వృషభ రాశి

బృహస్పతి ఉదయించడం వృషభ రాశి వారికి ఈ సమయం అనుకూలం. ఈ కాలంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరగడంతో ఆదాయంలో పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. మనసు సంతృప్తిగా ఉంటుంది. కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 

మిథున రాశి

బృహస్పతి సంచారం మిథున రాశి వారికి కొన్ని శుభవార్తలు ఇస్తుంది. వ్యాపార వృద్ధికి బలమైన సూచనలు ఉన్నాయి. గతంలో చేతికి అందకుండా పోయిన డబ్బు ఇప్పుడు దాన్ని తిరిగి పొందుతారు. పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం. మీ ప్రతి కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది. 

ధనుస్సు రాశి

కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం లభిస్తుంది. కోర్టు కేసులు, వాణిజ్యానికి సంబంధించిన చట్టపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. కార్యాలయంలో మీ పనికి తగిన ప్రోత్సాహక ప్రతిఫలాలు అందుకుంటారు. ఈ కాలంలో శారీరక సౌకర్యాన్ని అనుభవిస్తారు. సంపదను కూడబెట్టడంలో విజయవంతం అవుతారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేయగలుగుతారు. 

 

 

Whats_app_banner