వేద జ్యోతిష్య శాస్త్రంలో గురువు జ్ఞానం, గురువు సంతానం, చదువు మొదలైన వాటికి కారకుడు. గురువు శుభగ్రహాలలో ఒకటి. 2025లో గురువు తిరోగమనంలో ఉంటాడు. నవంబర్ 11న గురువు తిరోగమనం చెందుతాడు. డిసెంబర్ 5 వరకు తిరోగమనంలోనే సంచరిస్తాడు. గురువు దాదాపు 25 రోజులు మిథున రాశిలో తిరోగమనంలో ఉంటాడు.
ఈ సమయంలో మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఈ వ్యక్తుల సంపాదన పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ వ్యక్తుల వృత్తిలో పురోగతి ఉంటుంది. గురువు తిరోగమనంతో ఏయే రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు? వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? వంటి విషయాలని తెలుసుకుందాం.
గురువు తిరోగమనం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. కెరియర్లో విజయాలను అందుకుంటారు. బిజినెస్‌లో కూడా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక లాభాలను మూడు రాశుల వారు పొందబోతున్నారు.
సింహ రాశి వారికి గురువు తిరోగమనం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అనుకోకుండా ధనం చేతికి వస్తుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోవడం మంచిది కాదు.
కన్యా రాశి వారికి గురువు తిరోగమనం వలన అనేక లాభాలు ఉంటాయి. కెరియర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. వ్యాపారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు రావచ్చు. మొత్తానికి ఈ రాశుల వారి జీవితంలో సంతోషం ఎక్కువవుతుంది.
తులా రాశి వారికి గురువు తిరోగమనం లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.