Jupiter mars conjunction: బృహస్పతి, కుజుడి కలయిక.. ఈ మూడు రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు
Jupiter mars conjunction: బృహస్పతి, కుజుడి కలయిక వృషభ రాశిలో జరగబోతుంది. దీని ప్రభావంతో మూడు రాశుల వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు. అవి ఏ రాశులో తెలుసుకుందాం.
Jupiter mars conjunction: దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. ఇప్పుడు గ్రహాల అధిపతి అయిన కుజుడు ఒకే రాశిలో కూర్చోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కుజుడు జూలై 12 రాత్రి 07:12 గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే సమయంలో బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు.
ఏడాది పాటు గురు గ్రహం ఇదే రాశిలో ఉంటుంది. బృహస్పతి నవ గ్రహాలలో శుభకారమైనదిగా భావిస్తారు. సంపద, విలాసం, అదృష్టం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితాన్ని బృహస్పతి ప్రభావితం చేస్తాడు. కుజుడు శౌర్యం, ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి వాటికి కారకుడిగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు కలిస్తే ఆత్మవిశ్వాసం పెరగడంతో అన్నింటా విజయాలు సాధిస్తారు.
అటువంటి పరిస్థితిలో వృషభ రాశిలో కుజుడు, బృహస్పతి కలయిక ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతుంది. బృహస్పతి, అంగారక గ్రహాల కలయిక ఆగస్టు 25 వరకు ఉంటుంది. ఈ రెండు గ్రహాల సంయోగం ఏ రాశిచక్ర వారికి అదృష్టం తలుపులు తెరుస్తుందో చూద్దాం.
మేష రాశి
మేష రాశి నుంచే కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు. దీని ప్రభావంతో మేష రాశి వారికి బృహస్పతి, అంగారక గ్రహాల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో మీ సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు కొత్త పెట్టుబడి ఎంపికల గురించి ఆలోచిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
మకర రాశి
బృహస్పతి, అంగారక గ్రహాల కలయిక మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రశంసలకు అందుకుంటారు. వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి. చిన్న సమస్యలు తలెత్తవచ్చు, మీ భాగస్వామి మద్దతుతో వాటిని సులభంగా పరిష్కరించుకోగలగుతారు. మీరు ఎంత నిర్భయంగా ఉంటారో, అంత విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి బృహస్పతి, కుజుడి కలయిక శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక శుభ ప్రభావం కారణంగా మీ పెండింగ్ పనులన్నీ ప్రారంభమవుతాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆనందం, సంపద యొక్క ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమికులు రొమాంటిక్ ట్రిప్ కి ప్లాన్ చేసుకోవచ్చు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.