Jupiter mars conjunction: 12 ఏళ్ల తర్వాత గురు, కుజుడి కలయిక.. ఈ నాలుగు రాశుల వారికి సంపద పెరుగుతుంది-jupiter mars conjunction after 12 years these zodiac signs get bumper offers ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Mars Conjunction: 12 ఏళ్ల తర్వాత గురు, కుజుడి కలయిక.. ఈ నాలుగు రాశుల వారికి సంపద పెరుగుతుంది

Jupiter mars conjunction: 12 ఏళ్ల తర్వాత గురు, కుజుడి కలయిక.. ఈ నాలుగు రాశుల వారికి సంపద పెరుగుతుంది

Gunti Soundarya HT Telugu
Published Jun 17, 2024 12:04 PM IST

Jupiter mars conjunction: బృహస్పతి, కుజుడి కలయిక వృషభ రాశిలో ఉండనుంది. సుమారు 12 సంవత్సరాల తర్వాత ఈ కలయిక జరుగుతుంది. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి శుభ ప్రయోజనాలు లభించబోతున్నాయి.

కుజుడు గురు కలయిక
కుజుడు గురు కలయిక

Jupiter mars conjunction: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశిచక్రాలను మారుస్తాయి. ఇది మేషం నుండి మీనం వరకు 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. జూలై 2024 నెల చాలా ప్రత్యేకమైనది.

వచ్చే నెలలో అంటే జూలైలో బృహస్పతి, అంగారక గ్రహం కలయిక ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారు చాలా శుభ ఫలితాలను పొందుతారు. దృక్ పంచాంగ్ ప్రకారం కుజుడు ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్నాడు. ఇక దేవగురువుగా భావించే బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు. బృహస్పతి ఏడాది పొడవునా ఇదే రాశిలో ఉంటాడు. అదే సమయంలో జూలై 12, 2024 రాత్రి 07:12 గంటలకు వృషభరాశిలో కూర్చుని కుజుడు బృహస్పతికి దగ్గరగా వస్తాడు. సుమారు 12 సంవత్సరాల తర్వాత గురు, కుజుడి కలయిక ఏర్పడుతుంది.

జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం వృషభ రాశిలో కుజుడు, గురు గ్రహ సంయోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు చేకూరుతుంది. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. మీ కెరీర్‌లో గొప్ప విజయాన్ని పొందుతారు. బృహస్పతి, కుజుడు కలయిక వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసివస్తుందో తెలుసుకుందాం.

వృషభ రాశి

వృషభ రాశి వారికి కుజుడు, గురు గ్రహాల కలయిక వల్ల బ్రహ్మాండమైన ప్రయోజనాలు అందిస్తుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో మీరు శక్తి, విశ్వాసంతో నిండి ఉంటారు. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి.

సింహ రాశి

అంగారక గ్రహం, బృహస్పతికి దగ్గరగా రావడం సింహ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పురోగతికి లెక్కలేనన్ని అవకాశాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. తండ్రితో సత్సంబంధాలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. తల్లిదండ్రుల సహాయంతో డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది.

వృశ్చిక రాశి

కుజుడు, బృహస్పతి కలిసి వృశ్చిక రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తారు. ఈ కాలంలో కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సంబంధాలలో మంచి పరస్పర అవగాహన, సమన్వయం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner