Raja yogam: దేవ గురువుగా భావించే బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నవగ్రహాలలో మంగళకరమైన గ్రహంగా పేరు గాంచిన కుజుడు కూడా ఇదే రాశిలో ఉన్నాడు. జులై 12 నుంచి కుజుడు వృషభ రాశి సంచారం చేస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో గురు, కుజ కలయికను శుభప్రదంగా పరిగణిస్తారు. ఆగస్ట్ 26 వరకు కుజుడు వృషభ రాశిలో ఉంది. తర్వాత మిథున రాశిలోకి వెళతాడు.
12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడు, బృహస్పతి కలయిక జరిగింది. ఇది గురు, కుజుడు కలిసి రాజయోగాన్ని సృష్టించారు. బృహస్పతి శుభ స్థానంలో ఉంటే ఒక వ్యక్తి అజ్ఞానం, చీకటి నుంచి బాటపడతాడు. నవగ్రహాలలో సానుకూల గ్రహంగా దీన్ని పరిగణిస్తారు. అదృష్టం, సంపద, కీర్తి, నైతికత, పిల్లలు, భక్తి, ధ్యానం, విశ్వాసం, అధ్యాత్మికతకు కూడా బృహస్పతి కారకుడు.
ఇక అంగారకుడు ఆశయాలు, కోరికలకు సంబంధించినది. శుభ స్థానంలో కుజుడు ఉంటే కండరాల బలం, దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. అటువంటి రెండు శుభ గ్రహాల కలయిక వల్ల మూడు రాశుల వారికి భారీ లాభాలు చేకూరతాయి. అవి ఏ రాశులకో తెలుసుకుందాం.
వృషభ రాశి లగ్న గృహంలో బృహస్పతి కుజుడి శుభ కలయిక ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపార ప్రణాళికలు అమలు పరిచేందుకు ఇది అనుకూలమైన సమాయమ. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నుతన సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
సింహ రాశి పదో ఇంట్లో గురు కుజ కలయిక ఏర్పడుతుంది. ఈ కాలంలో వారి కోరికలన్నీ నెరవేరతాయి. వ్యాపారులకు విజయం చేకూరుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయావకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. వ్యాపారులకు ఈ కాలంలో కొత్త ఒప్పందాలు వస్తాయి. వాహనం, ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రమోషన్ పొందుతారు. చాలా పనుల్లో విజయాలు సాధిస్తారు. తోబుట్టువులకు సంబంధించిన శుభవార్త అందుతుంది. జీవితంలో కొన్ని మార్పులు సంతోషాన్ని అందిస్తాయి.
బృహస్పతి అంగారకుడి రాజయోగం తులా రాశి ఎనిమిదో ఇంట్లో ఏర్పడుతుంది. ఈ కాలంలో వీరి జీవితం ఆనందంతో నిండిపోతుంది. మనసు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో విజయానికి గొప్ప అవకాశాలు పొందుతారు. వ్యాపారస్థులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు సంపాదించడమే కాదు వాటిని ఆదా చేసుకోవడంలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తి, గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషాల వాతావరణం నెలకొంటుంది. లావాదేవీలు, వివాదాస్పద కేసులు పరిష్కారం అవుతాయి. విజయం చేకూరుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.