Lucky zodiac signs: 2025 లో రాశులు మారబోతున్న గురు, శని గ్రహాలు.. వీరి అదృష్టానికి అడ్డే ఉండదు
Lucky zodiac signs: 2025 సంవత్సరంలో గురు, శని గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. దీని ప్రభావంతో మూడు రాశుల వారి అదృష్టానికి అడ్డే ఉండదు. పట్టిందల్లా బంగారంలాగా జీవితం మారిపోతుంది.
Lucky zodiac signs: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక సమయం తర్వాత తన రాశి, నక్షత్ర రాశులను మారుస్తాయి. ఇది రాశి చక్రంలోని మొత్తం రాశులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం శని దేవగురువు బృహస్పతి 2024 సంవత్సరం మొత్తం తం రాశి చక్రాలను మార్చుకోరు.
2023 నుంచి శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని తన రాశి చక్రం మార్చుకుంటుంది. అదే సమయంలో ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు ఏడాది సమయం పడుతుంది. అంటే వచ్చే ఏడాది 2025 లో శని, గురు గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోబోతున్నాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం 2025 మార్చి 29వ తేదీ శని కుంభ రాశిని వీడి మీన రాశిలోకి సంచరిస్తాడు. శని రాశి మార్పుతో కొందరికి శని చెడు దృష్టి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక బృహస్పతి మే 14, 2025 సంవత్సరంలో మిథున రాశి ప్రవేశం చేస్తాడు. దీని ప్రభావంతో 2025వ సంవత్సరంలో కొన్ని రాశుల గురు శని మార్పు నుంచి అధిక ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. సంపద పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి పనిలో అదృష్టం మీకు మద్ధతు ఇస్తుంది. బృహస్పతి శని మార్పు వల్ల ఏయే రాశులు ప్రకాశిస్తాయో తెలుసుకుందాం.
మేష రాశి
గురు, శని గ్రహాల రాశుల మార్పు మేష రాశి వారికి చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. కోర్టు కేసుల నుంచి వీరికి వచ్చే ఏడాది ఉపశమనం లభించబోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కెరీర్ లో అపారమైన విజయాలు నమోదు చేసుకుంటారు. వ్యాపారంలో వృద్ధికి ఎన్నో సువర్ణావకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. దంపతుల మధ్య దూరం తొలగిపోయి కలిసిపోతారు. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
మకర రాశి
గురు శని గ్రహాల మార్పు మకర రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు వృత్తిలో చాలా పురోగతి సాధిస్తారు. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు కనిపించడంతో మీ ఆనందానికి అవధులు ఉండవు. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. డబ్బు సంపాదించడానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరిస్థితిలో మార్పు రావడంతో మీ సంతోషం రెట్టింపు అవుతుంది. సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు.
మీన రాశి
శని గురు సంచారం మీన రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. శత్రుపీడ వదిలిపోతుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆవివాహితులకు వివాహ ఘడియలు వస్తాయి. వ్యాపారంలో వృద్దికి అవసరమైన ఒప్పందాలు చేసుకుంటారు. రాజకీయంగా స్థిరపడతారు. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులుగా ఉంటారు.