జూన్ 2 సోమవారం నుంచి కొత్త వారం మొదలైంది. ఈ వారం చంద్రుడు సింహ రాశిలోకి సంచరిస్తాడు. సూర్యుడు వృషభ రాశిలో ఉన్నాడు. గ్రహాల రాకుమారుడు బుధుడు జూన్ 6న మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష లెక్కల ప్రకారం, ఈ వారంలో బుధుడు మిధున రాశిలో, సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వీరి కలయిక భాస్కర యోగాన్ని సృష్టిస్తుంది.
ఈ యోగ ప్రభావం వలన 12 రాశుల వారికి శుభ-అశుభ ఫలితాలు కలుగుతాయి. అయితే మూడు రాశుల వారికి మాత్రం అనేక లాభాలు ఉంటాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
వృషభ రాశి వారికి జూన్ మొదటి వారం బాగా కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. గ్రహాల ప్రభావం వలన సంతోషం పెరుగుతుంది. మత, సామాజిక పనులతో మీ మనసు నిమగ్నం అవుతుంది. విభేదాలు తొలగిపోతాయి. శుభం కలుగుతుంది. అదృష్టాన్ని పొందుతారు.
సింహ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యాలయంలో కూడా ప్రశంసలు అందుకుంటారు. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది. ఆదాయ వనరులు సృష్టిస్తారు. సంపద పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కార్యాలయంలో కృషికి ప్రశంసలు దక్కుతాయి.
తులా రాశి వారికి జూన్ మొదటి వారం బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో, మీ ప్రేమ భాగస్వామి సంతోషంగా ఉంటారు. ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు సక్సెస్‌ను అందుకుంటారు. వారం మధ్యలో సంతోషం, ధనం కూడా కలుగుతాయి. మొత్తానికి వారం మొత్తం సంతోషంగా ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.