జూన్ 6, నేటి రాశి ఫలాలు.. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ06.06.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 06.06.2024
వారం: గురువారం, తిథి : అమావాస్య,
నక్షత్రం : రోహిణి, మాసం : వైశాఖము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణ సూచనలున్నాయి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృథా ఖర్చులుంటాయి. దూరప్రయాణాలు వాయిదాపడతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లఖిస్తాయి. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించడం మంచిది.
కర్కాటక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. వృతి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.
సిం హ రాశి
సింహరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కారం దిశగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పరించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారంలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. సంతానం, విద్యా విషయాలలో నూతన అవకాశాలు లఖిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి కీలక విషయాలు సేకరిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురుదక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. సోదర వర్గం నుంచి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో కొన్ని సమస్యలుంటాయి. మీ సహోద్యోగుల నుంచి మీకు సహకారముంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా మీకు చాలా ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. కోపావేశాలను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులకు పోటీ పరీక్షలో కొన్ని సమస్యలుండవచ్చు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేసే ప్రయత్నాలు విజయవంతగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో కొన్ని సమస్యలు ఎదుర్శొనే అవకాశముంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య సమస్యలుంటాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించాలి. శ్రీ గురుచరిత్ర పఠించాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులున్నాయి. ఆరోగ్యం అనుకూలించును. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000