జూన్ 3, నేటి రాశి ఫలాలు.. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు-june 3rd 2024 today rasi phalalu check daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 3, నేటి రాశి ఫలాలు.. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు

జూన్ 3, నేటి రాశి ఫలాలు.. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు

HT Telugu Desk HT Telugu
Jun 03, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ03.06.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 3వ తేదీ నేటి రాశి ఫలాలు
జూన్ 3వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 03.06.2024

వారం: సోమవారం, తిథి : ద్వాదశి,

నక్షత్రం : అశ్విని, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తుల హోదా పెరుగుతాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. ధన వ్యయ సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సమస్యలు తీరతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుణ్ణి అభిషేకించడం, పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. విద్యా విషయంలో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. మీ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పాత విషయాలు గుర్తు తెచ్చుకుంటారు. ఉద్యోగస్తులు మంచి మాటతీరులతో అందరినీ ఆకట్టుకుంటారు. నూతన వ్యాపారాలు విస్తరిస్తాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ, కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.

కర్కాటక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అధికారులు ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలుంటాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు ఆకస్మికంగా మార్పు చేస్తారు. వృత్తి ఉద్యోగాలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్టకాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు స్థాన చలన మార్పులుంటాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలు వాయిదాపడతాయి. మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో పరిచయాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయటపడతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. రాజకీయ నాయకుల ప్రయత్నాలు ఫలిస్తాయి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను రాజీ చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సంతానం విద్యావిషయాలపై దృష్టిపెడతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. కొన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉన్నది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాల నుండి బయటపడతారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలున్నవి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల నుంచి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి విశ్రాంతి లభిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పాత రుణాలు తీర్చుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ఆనందముగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel