జూన్ 14, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడాలి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ14.06.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 14.06.2024
వారం: శుక్రవారం, తిథి : అష్టమి,
నక్షత్రం : ఉత్తరఫల్నుణి, నక్షత్రం : పుబ్బ, మాసం : జ్యేష్టము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనపరంగా ఇబ్బందులుండవు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. అన్ని విధాలుగా కలసి వచ్చే సమయం. బంధు మిత్రులతో ఆనందముగా గడుపుతారు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. బంధు మిత్రులతో విభేదాలేర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. సహనం వహించడం అన్ని విధాల మేలు. అనారోగ్య సమస్యలుంటాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీ శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవటం మంచిది. మానసికంగా ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం మంచిది. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు మిత్రులతో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో స్థాన చలన మార్పులుంటాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశమున్నది. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.
కన్యా రాశి
కన్యారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధు మిత్రులతో అభిప్రాయభేదాలు ఏర్పడే సూచనలున్నాయి. మానసికాందోళన. ఆకస్మిక కలహాలకు అవకాశముంది. చెడు సహవాసాలకు దూరంగా ఉండుట మంచిది. అకాల భోజనం వలన అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 'శ్రీకృష్ణుడిని పూజించాలి. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయి.
తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో స్థాన చలనం ఏర్పడే అవకాశాలున్నాయి. రుణలాభం పొందుతారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి. విదేశీ యాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉన్నది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఎలర్జీతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. అలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పరించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతీ పని మీకు కలసివచ్చును. ఉద్యోగంలో సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. బంధు మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. మీ ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్రాభరణాలు పొందుతారు. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీ శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి చూడాలి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీఅష్టకం పఠించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000