July horoscope: గ్రహాలు, నక్షత్రాల స్థానం పరంగా జూలై నెల చాలా ప్రత్యేకమైనదిగా మారనుంది. జూలై నెలలో కొన్ని రాశుల వారికి ఆర్థిక, వ్యాపార, వృత్తి రంగాలలో లాభాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలైలో చాలా గ్రహాలు రాశిచక్ర గుర్తులను మారుస్తాయి.
శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు కూడా కర్కాటకంలో సంచరిస్తాడు. కుజుడు మేష రాశిలో ఉన్నాడు. అటు దేవగురువుగా భావించే బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇక కర్మల అనుసారం ఫలితాలు ఇచ్చే శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరించబోతుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా కర్కాటక రాశిలో తన సంచారం చేయబోతున్నాడు. అనేక గ్రహాల సంచారం వల్ల ఏ రాశి వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి జులై నెల ప్రత్యేకంగా మారబోతుంది. ఈ కాలంలో వృషభ రాశి ప్రజలు ఆర్థిక లాభం కోసం అనేక ఆకర్షణీయమైన అవకాశాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కొత్త ఉద్యోగం కోసం మంచి ఆఫర్లను పొందవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. గతంలో మీరు ఎక్కడైన పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. మొత్తంమీద జూలై నెల మీకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది.
కర్కాటక రాశి వారికి ఉన్న కల ఏదైనా సరే అది జూలై నెలలో నెరవేరుతుంది. ఈ కాలంలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.
కన్యా రాశి వ్యక్తులు జూలై నెలలో తమ కెరీర్‌లో అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అదృష్టం అండగా ఉండటం వల్ల కొన్ని కష్టమైన పనుల్లో విజయం సాధించగలుగుతారు. కోర్టు కేసుల్లో విజయం సాధ్యమవుతుంది.
తులా రాశి వారికి జులై నెల శుభప్రదమైన మాసం కాబోతుంది. ఈ రాశి వారికి ఈ సమయం వరం కంటే తక్కువ కాదు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించడంతో ఆనందానికి అవధులు ఉండవు. వ్యాపారస్థులకు ఈ కాలం లాభదాయకం. మీ కలలు కొన్ని నెరవేరతాయి. ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన మార్పు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి వారికి శనీశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. జూలై మాసం మకర రాశి వారికి సుఖాలు, విలాసాలతో నిండి ఉంటుంది. ఈ నెలలో మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. సంతోషం పెరుగుతుంది. ఆనందం చేకూరుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.