జులై 26, నేటి రాశి ఫలాలు.. వీళ్ళు తమ తెలివితేటలతో ప్రత్యర్థులను అబ్బురపరుస్తారు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ26.07.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 26.07.2024
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 12, 2025, 08:57 PMఈ మూడు రాశులకు గుడ్టైమ్ షురూ.. అన్నింటా అదృష్టం!
వారం: శుక్రవారం, తిథి : షష్టి,
నక్షత్రం: ఉత్తరాభాద్ర, మాసం : ఆషాఢము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొవడానికి సిద్ధం కండి. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అవసరాలకు సరిపడా డబ్బు సమకూరుతుంది.
వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరంగా పర్వాలేదనిపిస్తుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి ఉంటుంది.
మిథున రాశి
పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయాలకు కూడా అనుకూలమైన కాలం. దూర ప్రయాణాలు ప్రశాంతతను ఇస్తాయి. ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. అధికారుల మన్ననలు పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు వారి తెలివితేటలతో ప్రత్యర్థులను అబ్బురపరుస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు కుటుంబ సభ్యులు గౌరవం ఇస్తారు. ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.
సింహ రాశి
కొంతకాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంటాబయట సత్సంబంధాలు ఏర్పర్చుకుంటారు. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. ఉద్యోగంలో నూతన ఉత్తేజంతో పనిచేస్తారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈరోజు సమస్యలు తీరతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు కలిసి వచ్చే కాలమిది.
తులా రాశి
తులా రాశి వారికి విశేష ఫలితాలున్నాయి. జీవితం ఆనందమయమవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కొగలరు. ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి.
వృశ్చిక రాశి
చదువు విషయంలో మరింత కృషి, శ్రద్ధ అవసరం. అన్ని విషయాల్లో విజయం కలిసి వస్తుంది. పెట్టుబడులకు సరైన సమయం కాదు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం.
ధనుస్సు రాశి
ఆర్థికపరంగా చాలా అనుకూలమైన పరిస్తితి, కుటుంబ పరంగా మీకు మంచి మద్దతు లభిస్తుంది. సంతానం విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితం సమస్యలతో కూడుకున్నది. అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో కలిసి వచ్చే కాలం. పై అధికారులు, సహచరులతో సత్సంబంధాలు ఉంటాయి.
కుంభ రాశి
మీ ప్రయత్నాలు మంచి ప్రతిఫలాలను అందిస్తాయి. మీకు మరింత ప్రేరణ లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మీన రాశి
ఉద్యోగములో కొత్త బాధ్యతను స్వీకరిస్తారు. అమోఘమైన వాక్పటిమను ప్రదర్శించండి. ఇతరులపై విజయం సాధిస్తారు. దీర్ఘకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో కలిసి వచ్చే కాలం. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం.