జులై 21, నేటి రాశి ఫలాలు.. నవగ్రహ స్తోత్రాలు పఠించండి అంతా శుభమే జరుగుతుంది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ21.07.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 21.07.2024
వారం: ఆదివారం, తిథి : పూర్ణిమ,
నక్షత్రం: ఉత్తరాషాఢ, మాసం : ఆషాఢము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేష రాశి
గతంతో పోలిస్తే మేష రాశి వారికి ఇప్పుడు శుభకాలం నడుస్తోంది. ప్రతి ప్రయత్నమూ గొప్ప ఫలితాలు అందిస్తుంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తుపై దృష్టి సారించండి. గృహ, వాహన, యోగాలున్నాయి. వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. లక్ష్మీదేవిని పూజించండి. అంతా శుభమే జరుగుతుంది.
వృషభ రాశి
అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు ఉన్నా ఆత్మవిశ్వాసంతో అన్నింటినీ జయిస్తారు. ఏకాగ్రతతో పని చేయండి. మిత్రుల సాయం తీసుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
మిథున రాశి
వ్యాపారయోగం ఉంది. ఆలోచనలను మెరుగుపరుచుకోవాలి. గతంలోని పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. మరింత ఓర్పు అవసరం. కొందరి చర్యలు మిమ్మల్ని ఉద్వేగానికి గురిచేస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబసభ్యులను భాగస్వాములను చేయండి. నిరంతర సాధనతో వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఇష్టదైవాన్ని స్మరించాలి.
కర్కాటక రాశి
నేటి రాశిఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండనుంది. శుక్రగ్రహ యోగం వల్ల ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. అవరోధాలు ఎదురైనప్పుడు స్థితప్రజ్ఞతతో స్పందించండి. న్యాయపరమైన చిక్కులు తొలగుతాయి. పనులు వాయిదా వేయవద్దు. ఉద్యోగులు తమ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. లక్ష్మీదేవిని పూజించండి.
సింహ రాశి
ఉద్యోగంలో పదోన్నతి సూచనలున్నాయి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం వద్దు. ఆత్మీయుల సలహాలు తీసుకోండి. సందర్భాన్ని బట్టి పట్టువిడుపులు ప్రదర్శించాలి. వ్యాపారంలో మరింత కృషి అవసరం. ఆర్థిక నిర్ణయాలకు దూరంగా ఉండండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కన్యా రాశి
ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. లాభనష్టాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోండి. రాను రాను అంతా మంచే జరుగుతుంది. గ్రహ యోగాల వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కీలక సమయాల్లో బంధుమిత్రులు అండగా నిలుస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.
తులా రాశి
మనోబలం చాలా అవసరం. ఎందుకంటే, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది. ప్రతికూల ఆలోచనలు వద్దు. కుటుంబసభ్యుల మద్దతు ఎంతో అవసరం. ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
వృశ్చిక రాశి
కీలక పనుల్లో మీ నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. ఏకాగ్రతతో పని చేయండి. మనోబలం చాలా అవసరం. తరచూ నిర్ణయాలు మార్చుకోవద్దు. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. శుక్రగ్రహ యోగం వల్ల ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.
ధనుస్సు రాశి
లక్ష్యాలకు చేరువవుతారు. గత వైభవాన్ని పొందుతారు. వివిధ మార్గాలలో లాభాలు అందుకుంటారు. తక్షణ స్పందనతో వ్యాపార వ్యవహారాల్లో నష్టాలను అధిగ మిస్తారు. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని గెలుస్తారు. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మీ అష్టకం పఠించండి.
మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు ఆశయాల వైపుగా అడుగేయాల్సిన సమయమిది. ఉద్యోగులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. గురుబలం వల్ల నైపుణ్యాలను పెంచుకుంటారు. ఓర్పు అవసరం. కొందరి వల్ల మీ ఏకాగ్రతకు భంగం కలుగవచ్చు. మనోబలంతో ఆ చికాకులను అధిగమించండి. సౌమ్యంగా సంభాషించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కుంభ రాశి
వ్యాపారంలో లాభాలు సూచితం. లక్ష్యసాధనకు మరింత ఏకాగ్రత అవసరం. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో నష్టాలకు ఆస్కారం. మెలకువతో వ్యవహరించండి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న కారణంగా దూకుడు పనికిరాదు. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
మీన రాశి
ఏకాగ్రతతో పనులు ఆరంభించండి. మీరు అనుసరిస్తున్న ధర్మమే మిమ్మల్నికాపాడుతుంది. ధనయోగం ఉంది. సోపేతమైన నిర్ణయాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుకుంటారు. కీర్తి పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి.