Today rasi phalalu: జులై 16, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి, ఈ రోజు ఏపనీ మొదలుపెట్టకండి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 16.07.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 16.07.2024
వారం: మంగళవారం, తిథి : దశమి,
నక్షత్రం: విశాఖ, మాసం: ఆషాఢము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
ఇది మీకు అన్నింటా కలిసి వచ్చే కాలం. ప్రయత్నాలు కొనసాగించండి. రావలసిన ధనం చేతికి అందుతుంది. అవసరమైన వారికి సాయం చేస్తారు. కీలక పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
వృషభం
కీలక కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పలు కార్యక్రమాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. కీలక విషయాల్లో కుటుంబసభ్యులు మీ సలహాలు తీసుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఉల్లాసంగా గడుపుతారు.
మిథునం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. రుణ సమస్యలు తొలగుతాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
కర్కాటకం
ఈ రాశి వారు చేస్తున్న పనిపట్ల ఏకాగ్రతతో వ్యవహరించండి. మీ ప్రమేయం లేకపోయినా తప్పులు దొర్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ప్రముఖుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.
సింహం
ఆర్ధిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. అనివార్య కారణాల వల్ల కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఇతరులపై ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయులతో సరదాగా గడుపుతారు.
కన్యా రాశి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ కృషికి అదృష్టం తోడవుతుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీ అభిప్రాయాలకు అనుకూల స్పందన లభిస్తుంది.
తులా రాశి
అనుకోకుండా అభియోగాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఒక సమాచారం మీలో ఉత్తేజాన్ని పెంచుతుంది. ధైర్యంగాయత్నాలు సాగిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం. ఆప్తులకు కష్టసుఖాలు పంచుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
వృశ్చికం
ఆశావహ దృక్పథంతో మెలగండి. ప్రయత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు.
ధనుస్సు
ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్య మనస్కంగా గడుపుతారు. మనసుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పిల్లలకు శుభఫలితాలున్నాయి.
మకరం
మకర రాశి వారికి ఈరోజు అంతంత మాత్రమేగానే ఉంది. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వివాదాస్పద విషయాలు జోలికి పోవద్దు. ఖర్చులు అధికంగా ఉండనున్నాయి. ధనసహాయం ఎవరికీ చేయొద్దు. ఎదుటివారితో మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ కించపరచవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది.
కుంభం
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. పొగిడేవారి ఆంతర్యం గ్రహించండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి.
మీనం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం కానున్నాయి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు.
టాపిక్