నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 15.07.2024
వారం: సోమవారం, తిథి : నవమి,
నక్షత్రం: స్వాతి, మాసం: ఆషాఢము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయణం
ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు సూచితం. పసుపు, నేరేడు రంగులు శుభదాయకం. గణేశాష్టకం పఠించండి.
సమయస్ఫూర్తితో ఇబ్బందులు అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగపరమైన సమస్యల నుంచి బయటపడతారు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. శివాష్టకం పఠించండి.
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త రుణాల కోసం అన్వేషణ మొదలుపెడతారు. విద్యార్థుల కృషి వృథా అవుతుంది. ముఖ్యమైన పనుల్లో సమస్యలు ఎదురవుతాయి. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. వ్యాపారాల్లో గందరగోళం నెలకొంటుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వారం మధ్యలో వాహనయోగం ఉంది. నేరేడు, ఆకుపచ్చ రంగులు ధరించండి. హయగ్రీవస్తోత్రాలు భక్తి శ్రద్ధలతో చదవండి.
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలకు సరైన సమయం. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాల్లో ఇబ్బందులు అధిగమిస్తారు. గులాబీ, లేత పసుపు రంగులు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ దండకం చదవండి.
చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక పరంగా సంతృప్తికర ఫలితాలు అందుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కుటుంబసభ్యులతో వివాదాలు తొలగుతాయి. పసుపు, తెలుపు రంగులు సత్ఫలితాలు ఇస్తాయి. అన్నపూర్ణాష్టకం చదవండి.
ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. గులాబీ, లేత ఎరుపు రంగులు ధరించండి. దక్షిణామూర్తి స్తోత్రాలు చదవండి.
కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల పరిష్కారమవుతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారుతుంది. ఆరోగ్యంపై దృష్టి సారించండి. వ్యాపారాల్లో ఒకింత లాభాలు ఉండొచ్చు. ఆకుపచ్చ, నీలం రంగులు శుభ సూచికం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందడుగు వేస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థుల చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండొచ్చు. ఎరుపు, గులాబీ రంగులు మంచి ఫలితాలు ఇస్తాయి. విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేయండి.
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు రాగలవు. నేరేడు, నీలం రంగులు ధరించండి. హనుమాన్ చాలీసా పఠించండి.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాల్లో మీ గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఆకుపచ్చ, ఎరుపు రంగులపై మక్కువ చూపండి. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలు ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆకుపచ్చ, పసుపు రంగులతో ఉన్న దుస్తులు ధరించండి. నృసింహస్తోత్రాలు పఠించండి.
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేసేందుకు సరైన సమయం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు కలిసి వస్తాయి. గణేశ్ స్తోత్రాలు పఠించండి.