జన్మాష్టమి 2025: ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి-janmashtami or krishnashtami 2025 check date time krishna puja vidhanam and full details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జన్మాష్టమి 2025: ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి

జన్మాష్టమి 2025: ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu

శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని అన్ని దేవాలయాలు, ఇళ్ళలో ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని అర్ధరాత్రి జరుపుకుంటారు. రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుని జనన సమయంలో పాలాభిషేకం జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

జన్మాష్టమి 2025

చాలా మంది జన్మాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కృష్ణుడి జన్మదినంగా కృష్ణాష్టమిని జరుపుకుంటారు. హిందూమతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం పవిత్ర శ్రావణ మాసంలో ఎనిమిదో రోజు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని అన్ని దేవాలయాలు, ఇళ్ళలో ఘనంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మదినాన్ని అర్ధరాత్రి జరుపుకుంటారు. రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుని జనన సమయంలో పాలాభిషేకం జరుగుతుంది.

జన్మాష్టమి పూజ:

ఈసారి జన్మాష్టమి ఆగస్టు 15న వచ్చిందా ఆగస్టు 16న వచ్చిందా అనే విషయానికి వస్తే.. పురాణాలు, మత గ్రంథాలు ప్రకారం, శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున వృషభ లగ్నంలో రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఈ పవిత్రమైన రోజున, దేవుడికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేస్తారు. భగవంతుని బాలరూపమైన లడ్డూ గోపాల్ కి స్నానం చేయించి, కొత్త బట్టలు ధరించి వెన్న, పంచామృతాలు, తులసి దళాలు సమర్పించాలి.

ఈసారి జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది?

హిందూ క్యాలెండర్ ప్రకారం అష్టమి తిథి 2025 ఆగస్టు 15 రాత్రి 11:49 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 16 రాత్రి 09:34 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15, 16 తేదీల్లో కృష్ణ జన్మాష్టమిని జరుపుకోనున్నారు. ఆగస్టు 15న జన్మాష్టమి ఉపవాసం ఉండే వారు ఆగస్టు 16న దానిని విరమిస్తారు. ఆగస్టు 16న జన్మాష్టమి జరుపుకునే భక్తులు ఆగస్టు 17న ఉపవాసం విరమిస్తారు.

జన్మాష్టమి పూజ ముహూర్తం:

జన్మాష్టమి పూజ యొక్క నిషిత ముహూర్తం ఆగస్టు 16న అర్ధరాత్రి 12.09 నుండి 12.54 గంటల వరకు ఉంటుంది. మొత్తం పూజ సమయం 44 నిమిషాలు.ఆగస్టు 17న అర్ధరాత్రి 12.04 గంటల నుంచి 12.47 గంటల వరకు నిషితా పూజ సమయం ఉంటుంది. మొత్తం పూజ సమయం 43 నిమిషాలు.

హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. ఈ ఉపవాసం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భావిస్తారు. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.