ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసం శుక్లపక్షం రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ ఏడాది రథయాత్ర నేటి నుంచి అంటే జూన్ 27న ప్రారంభం అయ్యింది. ఒరిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయం దాని వైభవానికి, మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శ్రీకృష్ణుని జగన్నాథ రూపానికి అంకితం చేయబడింది, ఇక్కడ అతని అన్నయ్య బలభద్ర, సోదరి సుభద్రను కలిసి పూజిస్తారు.
జగన్నాథ రథయాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ రోజున, జగన్నాథుడు, అతని అన్నయ్య, సోదరి మూడు పెద్ద రథాలపై తన అత్తవారి ఇంటి అయిన గుండిచా ఆలయానికి వెళతారు. జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు ఇక్కడ ఉన్నాయి.
జగన్నాథుని రథయాత్ర వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. జగన్నాథుడిని శ్రీకృష్ణుని రూపంగా భావిస్తారు. శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు ఆయన చితాభస్మాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. అదే సమయంలో ఒడిషా రాజు సముద్రం ఉన్న పవిత్రమైన కలపను చూసి, దానిని దేవుడిగా ప్రతిష్ఠించాలని కలలు కన్నాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఆ కలపతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాన్ని తయారుచేశాడు.
దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా భగవంతుని విగ్రహాన్ని తయారు చేయడానికి వచ్చాడని అంటారు. చీకటి గదిలో విగ్రహాలు తయారు చేస్తానని విశ్వకర్మ రాజు ముందు షరతు పెట్టాడు. విగ్రహం నిర్మించే వరకు ఎవరూ లోపలికి రాకూడని చెప్తాడు. రాజు ఈ షరతును అంగీకరించాడు. ఒక రోజు రాజు ఆ గది లోపలి నుండి ఎటువంటి శబ్దం వినపడకపోవడంతో లోపలికి వెళ్ళాడు.
అప్పటి నుంచి స్వామివారి విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను రాజు ఆలయంలో ప్రతిష్టించాడు. జగన్నాథుడు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి తన జన్మస్థలమైన మజురాను సందర్శిస్తారని అప్పట్లో ప్రవచించారు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఆషాఢ శుక్ల ద్వైతి రోజున స్వామిని తన జన్మస్థలానికి వెళ్ళేలా ఏర్పాట్లు చేశాడు. అప్పటి నుంచి రథయాత్ర సంప్రదాయం కొనసాగుతోంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.