Venus Transit: మూల నక్షత్రంలోకి శుక్రుడు- ఈ రాశుల వారికి కాసుల వర్షమే-jackpot for these zodiac signs happiness and huge wealth in life due to venus transit in moolanakshatra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: మూల నక్షత్రంలోకి శుక్రుడు- ఈ రాశుల వారికి కాసుల వర్షమే

Venus Transit: మూల నక్షత్రంలోకి శుక్రుడు- ఈ రాశుల వారికి కాసుల వర్షమే

Ramya Sri Marka HT Telugu
Published Nov 23, 2024 05:08 PM IST

Venus Transit: అత్యంత విలాసవంతమైన గ్రహంగా చెప్పుకునే మూల నక్షత్రంలో ప్రవేశించాడు. శుక్రుడి మూల నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి రాజయోగం. ఇంకేముంది వారిపై ఇక కాసుల వర్షమే కురవనుంది.

తొమ్మిది గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం శుక్రుడు
తొమ్మిది గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం శుక్రుడు

తొమ్మిది గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం శుక్రుడు. సంపద, శ్రేయస్సు, విలాసం, శృంగారం, అందానికి మూలంగా శుక్రుడిని భావిస్తారు. శుక్రుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుస్తాడు. శుక్రుడు వృషభం, తులా రాశులకు అధిపతి అయినప్పటికీ ఇతని సంచారంలో మార్పులు అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ సారి శుక్రుడు కేవలం రాశిని మాత్రమే కాదు తన నక్షత్రాన్ని కూడా మార్చుకున్నాడు. నవంబర్ 7న శుక్రుడు మూలా నక్షత్రంలోకి వచచ్చాడు. ఈ మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. శుక్రుడు కేతువు నక్షత్రంలోకి సంచరించడం కొన్ని రాశుల వారికి రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. శుక్రుడు మూలా నక్షత్రంలోకి వెళ్లడం వల్ల ఏ రాశి వారిపై కాసుల వర్షం కురవనుందో చూద్దాం..

మేషరాశి

శుక్రుని సంచారం వల్ల అదృష్టం కలిసొచ్చి చేసే పనుల్లో పూర్తి మద్దతు అందుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీరు వెళ్లే దారిలో అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పనులను విజయవంతంగా ముగిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వృత్తిపరంగా అదృష్టం కలిసొస్తుంది. మీరు వ్యాపారంలో ఊహించని లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి వివిధ మార్గాల నుండి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. వారసత్వ ఆస్తి వల్ల కలిగే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. షేర్ మార్కెట్ పెట్టుబడులు మీకు మంచి లాభాలను అందిస్తాయి. ఉద్యోగాల్లో పై అధికారులు అనుకూలంగా ఉంటారు. సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీరు పనిచేసే చోట ప్రమోషన్, జీతంలో పెంపు ఉంటుంది. మీరు వ్యాపారంలో చాలా లాభం పొంది , ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆరోగ్యమే మీకు బలంగా మారుతుంది.

కన్యా రాశి

శుక్రుని సంచారం మీకు ప్రత్యేకమైన రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది. సంపద పెరిగి జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. అవకాశాలు అంది సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి పరంగా మీరు వివిధ ప్రయోజనాలను పొందుతారు.

మీ సీనియర్ల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు పనిచేసే చోట పదోన్నతి పొంది, వేతన పెంపు అందుకుంటారు. మీరు ఆర్థిక పరిస్థితిలో మంచి పెరుగుదలను పొందవచ్చు. డబ్బు ఆదా చేయడానికి ఎక్కువ అవకాశాలు పొందుతారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner