మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కలల వెనుక సంకేతాలు ఉంటాయి. కొన్ని కలలు మంచి ఫలితాలను ఇస్తే, కొన్ని కలలు చెడు ఫలితాలను ఇస్తాయి. అప్పుడప్పుడు మనకి పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కలల ఆధారంగా, వాటి వెనుక అర్థం తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించవచ్చు. కలలో శనిదేవుడు కనపడితే మంచిదా కాదా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.
నిద్రపోయినప్పుడు కలలో శనిదేవుడు కనబడితే దానికి అర్థం ఏంటి? దాని వలన మంచి ఫలితాలు ఎదురవుతాయా, చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందా అనే విషయాన్ని చూద్దాం. కొంతమంది ఇప్పటికే శని సాడే సతి, ధయ్యా ప్రభావంలో ఉన్నారు. వారు ఈ సమయంలో శనిదేవుడిని కలలో చూసినట్లయితే, శనిదేవుడి దృష్టి ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి బాధలు కూడా తొలగిపోతాయి. ఈ కల శుభ ఫలితాలను ఇస్తుంది.
అదే మీ కలలో నెమలితో పాటు శని దేవుడు కనపడితే, అది మంచి సంకేతంగా భావించాలి. ఆనందం ఎక్కువవుతుంది, జీవితంలో మంచి ఫలితాలు ఎదురవుతాయి, ఆర్థికపరంగా కూడా లాభాలను పొందవచ్చు.
అదే ఒకవేళ శనిదేవుడు కాకిపై వస్తున్నట్లు కలలో కనబడితే, అది అశుభకరమైనదిగా భావించాలి. శనిదేవుడి వాహనం కాకి. అయినా, కాకితో పాటు శనిదేవుడు వస్తున్నట్లు కల వస్తే అది మంచిది కాదు. ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది.
ఒకవేళ శనిదేవుడు ఏనుగుతో పాటు మీ కలలో కనపడినట్లయితే, అది మంచి ఫలితాలను ఇస్తుంది. శనిదేవుడు ఏనుగుపై ఉన్నట్లు మీకు కల వచ్చినట్లయితే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, శ్రేయస్సును పొందవచ్చు. శని ప్రభావంలో వ్యక్తి ఉన్నట్లయితే, ఇలాంటి కల వచ్చినట్లయితే ఆ బాధలు తొలగిపోతాయి.
శనిదేవుడు గ్రద్దతో పాటు మీ కలలో కనపడితే, అది అశుభంగా భావించాలి. ఇటువంటి కలలు వచ్చినట్లయితే వినాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.
శనిదేవుడికి పూజ చేస్తున్నట్లు కల వచ్చినట్లయితే, శనిదేవుడు మీ పట్ల సంతోషంగా ఉన్నారని అర్థం. ఇలాంటి కలలు శుభ, అశుభ ఫలితాలను కూడా ఇస్తాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.