జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచభూతాలలో అగ్ని శక్తివంతమైనది, పవిత్రమైనది. శక్తి, కాంతి, కొత్త ప్రారంభం, జీవితంలో విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. పూజ లేదా ఇతర శుభకార్యాల్లో మొట్టమొదట మనం దీపారాధన చేస్తాము. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
మంటల్ని ఆర్పినప్పుడు, జీవితంలో ఆనందాన్ని పంచే శక్తిని నాశనం చేస్తున్నట్లు అర్థం. మన గ్రంథాలలో, పుట్టినరోజుతో పాటు ఏదైనా శుభకార్యాలను ప్రారంభించేటప్పుడు మంటల్ని ఆర్పడం అశుభకరమైనది. కాబట్టి పుట్టిన రోజు నాడు మంటను ఆర్పడం మంచిది కాదు.
పుట్టిన రోజు నాడు కొవ్వొత్తిని ఆర్పకండి. కేకు పక్కన ఒక కొవ్వొత్తి పెట్టి దానిని అందరితో పాటు వెలిగించండి. ఆ తర్వాత ఆ కొవ్వొత్తిని దేవుడి మందిరంలో పెట్టండి. చాకుతో కేకును కోయకుండా, ఏదైనా స్పూన్‌తో కేకును కోసి అందరికీ పంచండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు, గురువుల ఆశీర్వాదం తీసుకోండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.