మెట్ల కింద బాత్రూం ఉంటే ఏమవుతుంది? వాస్తు శాస్త్రం ఏం చెప్తోందో తెలుసుకోండి!-is it good to have bathroom under stairs check what vastu shastra tells about it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మెట్ల కింద బాత్రూం ఉంటే ఏమవుతుంది? వాస్తు శాస్త్రం ఏం చెప్తోందో తెలుసుకోండి!

మెట్ల కింద బాత్రూం ఉంటే ఏమవుతుంది? వాస్తు శాస్త్రం ఏం చెప్తోందో తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించాలంటే ఇంట్లో ఉన్న గదులు అన్నీ కూడా వాస్తు ప్రకారం ఉండేటట్టు చూసుకోవాలి. ఇంట్లో బాత్రూమ్‌ని ఏ దిశలో కట్టుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. చాలా మంది ఇళ్లల్లో మెట్ల కింద బాత్రూం ఉంటుంది. మెట్ల కింద బాత్రూమ్ ఉంటే మంచిదా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మెట్ల కింద బాత్రూం ఉంటే ఏమవుతుంది? (Shutterstock)

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా సరే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలా మంది ఇంటిని నిర్మించేటప్పుడు కూడా వాస్తు ప్రకారం వారి ఇంటిని నిర్మిస్తారు. వాస్తు ప్రకారం చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిని సరి చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది.

ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించాలంటే ఇంట్లో ఉన్న గదులు అన్నీ కూడా వాస్తు ప్రకారం ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఏ దిశలో బరువు ఉండొచ్చు, బరువు ఉండకూడదు వంటివి కూడా చూసుకోవాలి. ఏ దిశలో మంచం ఉండాలి, తల ఎటువైపు పెట్టుకుని నిద్రపోవాలి ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి.

మెట్ల కింద బాత్రూమ్

వీటితో పాటుగా ఇంట్లో బాత్రూమ్‌ని ఏ దిశలో కట్టుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. చాలా మంది ఇళ్లల్లో మెట్ల కింద బాత్రూం ఉంటుంది. మెట్ల కింద బాత్రూమ్ ఉంటే మంచిదా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం మెట్ల కింద బాత్రూమ్ ఉంటే మంచిదేనా?

చాలామంది ఇంట్లో మెట్ల కింద బాత్రూమ్ ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో మెట్ల కింద బాత్రూమ్ ఉంటే మంచిదా కాదా అనే విషయానికి వస్తే.. మెట్ల కింద ఉన్న బాత్రూమ్ బరువు, ఒత్తిడిని సూచిస్తాయి. అయితే మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇంట్లో మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది.

ఆరోగ్యం కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. అదే విధంగా మెట్ల కింద బాత్రూమ్ ఉంటే ఆర్థిక స్థిరత, సంపద కోల్పోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. డబ్బు రావడానికి ఆటంకాలు ఏర్పడతాయి. మెట్ల కింద బాత్రూమ్ ఉంటే అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని వాస్తు నిపుణులు అంటున్నారు.

మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అలాగే మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వలన బంధాలపై ప్రభావం పడుతుందట. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది.

సమస్యలు రాకుండా ఈ పరిష్కారాలను ట్రై చెయ్యచ్చు

  1. మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వలన చీకటిగా, గాలి ప్రవాహం లేకుండా ఉంటుంది. కనుక శక్తి సరిగా ఉండదు. అలా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మంచి వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి.
  2. మెట్ల కింద బాత్రూమ్ ఉంటే లేత రంగుల్ని ఉపయోగించడం మంచిది. దాని ద్వారా ప్రతికూల ప్రభావాలను తొలగించవచ్చు.
  3. బాత్రూమ్ కిటికీ దగ్గర కానీ, బాత్రూమ్ బయటకు కానీ అశోక మొక్కను నాటితే ప్రతికూల శక్తి నుంచి బయటపడొచ్చు. ఇలా ఈ చిన్న చిన్న పరిష్కారాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.