అప్పుడప్పుడు మనకి తెలియకుండా కొన్నికొన్ని జరుగుతూ ఉంటాయి. వాటి వెనక అర్థాలు కూడా ఉంటాయి. కలలు లేదా బల్లి పడడం వంటి వాటి వెనుక కొన్ని కారణాలు ఉంటాయని, కొన్ని సంకేతాలను తెలుపుతున్నాయని పెద్దలు అంటూ ఉంటారు.
అప్పుడప్పుడు మన ప్రభావం లేకుండానే కళ్ళు వాటి అంతట అవే కొట్టుకుంటూ ఉంటాయి. అలా కళ్ళు అదిరితే దేనికి సంకేతం అనేది తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కుడి కన్ను అదిరితే దాని వెనుక కారణం ఏంటి, అది ఏం తెలుపుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడవాళ్లకు కుడు కన్ను అదిరితే అశుభంగా భావిస్తారు. ఇలా ఆడవాళ్లకు జరిగినట్లయితే ఆమె కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందట. కుటుంబంలో ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కలగవచ్చని దీనికి సంకేతం. ఇలాంటి సంకేతం కనపడినప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మానసికంగా దృఢంగా ఉంటే సమస్యల్ని అధికమించగలుగుతారు.
ఎడమ కన్ను అదిరితే, ఈ పరిహారాన్ని పాటించడం మంచిది. ఇంటి పూజ గదిలో నేతితో దీపారాధన చేసి లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. తులసి మొక్క దగ్గర దీపారాధన చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.