Vastu Tips: ఇంట్లో సాలె పురుగులు గూడు కట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? వాస్తు ఏం చెబుతోంది?-is it good for spiders to nest in the house ominous what does vastu say ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: ఇంట్లో సాలె పురుగులు గూడు కట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? వాస్తు ఏం చెబుతోంది?

Vastu Tips: ఇంట్లో సాలె పురుగులు గూడు కట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? వాస్తు ఏం చెబుతోంది?

Haritha Chappa HT Telugu
Published Jun 16, 2024 12:00 AM IST

Vastu Tips: ఇళ్లల్లో సాలెపురుగుల గూళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అలా సాలెపురుగులు ఇంట్లో గూడు కట్టడం గురించి వాస్తు నిపుణులు వివరిస్తున్నారు.

ఇంట్లో సాలెగూడు ఉండొచ్చా?
ఇంట్లో సాలెగూడు ఉండొచ్చా? (Pexels)

Vastu Tips: ఇంటిని కొన్ని రోజులు శుభ్రపరచకపోతే చాలు ఇంటి పైకప్పు పై, ఇంటి మూలల్లో సాలెపురుగులు గూళ్ళు కట్టేస్తూ ఉంటాయి. అలా సాలెపురుగులు ఇంట్లో గూళ్ళు కట్టడం మంచిదో కాదో వివరిస్తున్నారు వాస్తు నిపుణులు. ఇలా ఇంట్లో సాలె పురుగులు గూళ్ళు కట్టడం అనేది వాస్తు దోషం కిందకే వస్తుందని చెబుతున్నారు. ఇంట్లో ఎక్కువగా స్పైడర్ వెబ్స్ ఉంటే కుటుంబ సభ్యుల జీవితంలో అనేక సమస్యలు వస్తాయని వివరిస్తున్నారు. అలాగే ఇంట్లో డబ్బు కొరత కూడా ఉండవచ్చని అంటున్నారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులు సోమరితనంగా మారడం, చిరాకులు పడడం వంటి ప్రతికూల అంశాలు ఎక్కువ అవుతాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

పడక గదిలో సాలె గూడు

ఇంటిలోని సాలె గూళ్ళు పెట్టిన ప్రాంతాలను బట్టి సమస్యలు వస్తూ ఉంటాయని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం బెడ్రూంలో సాలె గూడు కడితే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. వారు వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంటి మూలల్లో అంటే రెండు గోడలు కలిసిన మూలల్లో సాలెపురుగులు గూడు కడితే ఆ ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే డబ్బును వారు పోగొట్టుకోవచ్చు. ఇంట్లోని దేవుని మందిరంలో సాలెగూడు కడితే దాన్ని వెంటనే తొలగించండి. ఇది దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దేవుని చిత్రాలకు ఎలాంటి సాలెగూళ్ళు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక ఇంట్లో అతి ముఖ్యమైన గది వంటగది. వంటగదిలో ఏ మూలనైనా సాలె గూడులు కనిపిస్తే వెంటనే తొలగించండి. దీనివల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యాల బారిన పడతారు. వంట గదిలో గ్యాస్, సింక్ కింద ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అక్కడే అధికంగా సాలె పురుగులు గూళ్లు కడుతూ ఉంటాయి. ఇవి ఇలా గూళ్ళు కట్టడం వాస్తు ప్రకారం మంచిది కాదు.

ఇంట్లో సాలీడు గూళ్ళు కడితే అది వాస్తు దోషాలను తెస్తుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీనివల్ల ఆ ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల జీవితంలో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల ఆరోగ్యం పై ఇది నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. కొన్నిసార్లు ఆనందం అంటే ఏంటో ఆ కుటుంబం మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి మూలలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. స్పైడర్ గూళ్ళు కట్టుకోకుండా జాగ్రత్తగా ప్రతిరోజు ఒకసారి తుడుచుకుంటూ ఉండాలి. అపరిశుభ్ర వాతావరణంలోనే సాలీడు అధికంగా గూడు కడుతుంది. అలాగే ఎక్కడ అయితే సాలెగూడు కడుతుందో అక్కడ ప్రతిరోజూ తుడుచుకోవాలి. అక్కడే సాలీడు గూడు కట్టే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇంటినీ ప్రతిరోజు ఓసారి శుభ్రపరచుకుంటే ఉత్తమం.

Whats_app_banner