చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి, సంతోషంగా కూడా ఉండొచ్చు. వాస్తు ప్రకారం చాలా మంది తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాని వలన పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటిని నిర్మించడానికి మొదలు, ఇంట్లో ఏ వస్తువులు ఏ దిశలో ఉంచాలి అనే దాని వరకు చాలా మంది రకరకాల వాస్తు పరిహారాలని, వాస్తు చిట్కాలని పాటిస్తూ ఉంటారు.
ఈరోజు పక్షి గూడుకి సంబంధించి కొన్ని వాస్తు నియమాలని తెలుసుకుందాం. ఇంట్లో పక్షి గూడు ఉంటే మంచిదా కాదా, పక్షి గూడు ఉండచ్చా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి, ఇంట్లో పక్షి గూడు ఉండచ్చా, దాని వలన ఏమైనా నష్టం కలుగుతుందా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.
మామూలుగా మనం చాలా రకాల పక్షులను మన ఇంటి దగ్గర లేదా బాల్కనీలో కానీ, గార్డెన్‌లో ఉండడం కానీ చూస్తూ ఉంటాం. కొంతమంది దీనిని మామూలుగానే తీసుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పక్షులు ఇంటికి వచ్చి గూడు కట్టుకోవడం అదృష్టానికి భావించాలి. కొన్ని పక్షుల రాక ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, ఇబ్బందులను తొలగిస్తుంది. కానీ కొన్ని పక్షులు గూళ్లు ఉండడం మంచిది కాదు. మరి ఏ పక్షి గూడు ఇంట్లో ఉంటే మంచిది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో పిచుక గూడు ఉండడం వలన ఎన్నో మంచి ఫలితాలను చూడవచ్చు. హిందూ సంస్కృతిలో పిచుకను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ గూడు ఇంట్లో ఉంటే ఆనందం, శాంతి, కుటుంబ ఐక్యత, శ్రేయస్సు కలుగుతాయి. సానుకూల శక్తి కూడా ఆ ఇంట్లో ప్రవహిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయని దీనికి సంకేతం. సంతానం, ఆర్థిక శ్రేయస్సును కూడా పొందవచ్చు.
మైనా పక్షులు ఇంట్లో గూడు కడితే శుభం జరుగుతుంది. ఇంట్లో ప్రేమనురాగాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండవచ్చు. రిలేషన్‌షిప్‌లో కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
చిలుక ఇంట్లో గూడు కడితే చాలా మంచి జరుగుతుంది. చిలుక తెలివితేటలు, అదృష్టానికి చిహ్నం. చిలుక గూడు ఇంట్లో ఉంటే శుభవార్తలు వస్తాయి. ఇంట్లో చిలుక గూడు ఉండడం వలన పిల్లలు చదువులో ముందుంటారు, కెరీర్‌లో కూడా బాగా రాణిస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.