కలలో కాకి కనపడితే మంచిదా, కాదా?
- ఒక కాకి కలలో ముందు ద్వారం నుండి ఇంట్లోకి ప్రవేశించి మరొక ద్వారం ద్వారా బయటకు వస్తే, దాని అర్థం తోబుట్టువు లేదా తోబుట్టువులతో వాదన జరుగుతుంది. కుటుంబ పెద్దలలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
- మీరు చేతిలో కాకిని పట్టుకుని ఇంటి నుండి బయటకు వెళ్తున్నట్లు కల కన్నట్లయితే, ఉద్యోగం మారే అవకాశం ఉంది.
- మీరు కాకిని ఏదైనా వస్తువుతో మీ ఇంటి నుండి బలవంతంగా బయటకు తోస్తున్నట్లు కలలుగన్నట్లయితే, మీరు ఒక అవకాశాన్ని కోల్పోతారు.
- కలలో ఇంటి బయట ఉన్న కాకిని ఇంట్లోకి తీసుకువస్తే, అది మీ స్వంత తప్పు వల్ల కుటుంబంలో విభేదాలకు కారణమవుతుంది.
- ఇంట్లోకి జంట కాకులు వచ్చినట్టు కల వస్తే, ఆ కుటుంబంలో దంపతుల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి.
- కలలో కాకి నుంచి భయంతో మీరు దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, ఏదైనా పెద్ద వివాదం తలెత్తినా మీకు ఎటువంటి సమస్యలు ఎదురుకావు.
- ఎగరలేక నేలపై పడిపోయిన కాకిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, అది ఎగిరిపోయినట్టు కల వస్తే, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మీ పనిని నెమ్మదిగా పూర్తి చేసుకుంటారని అర్ధం.
- మీ ఇంట్లో ఉన్న కాకిని బలవంతంగా బయటకు తోస్తున్నా మీ ఇంట్లోకి తిరిగి వస్తూన్నట్టు కల వస్తే, మీ కుటుంబానికి సంబంధించిన భూమి విషయంలో వివాదం రావచ్చని అర్ధం.
- కాకి మీ ఇంటి నుండి మీ పక్క ఇంటికి ఏదైనా తీసుకెళ్లినట్లు కలలుగన్నట్లయితే, మీరు ఎదుర్కొంటున్న వివరాలు సాల్వ్ అయ్యిపోతాయని అర్ధం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.