హిందూ మతంలో చెవులు కుట్టడం పురాతన సాంప్రదాయం. అమ్మాయిలు చెవులు కుట్టించుకోవడం సర్వసాధారణమే. కానీ కొంత మంది అబ్బాయిలు కూడా చెవులు కుట్టించుకుంటూ ఉంటారు. అబ్బాయిలు చెవులు కుట్టించుకున్నారంటే చాలా మంది నవ్వుతారు. చాలా వింతగా చూస్తారు. అయితే, గ్రంధాల ప్రకారం అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెవులు కుట్టడం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది.
పూర్వకాలంలో అయితే చెవులు కుట్టించుకోని పురుషులను దహన సంస్కారాలకు కూడా అనుమతించేవారు కాదట. అబ్బాయిలకి కుడి చెవి, అమ్మాయిలకు ఎడమ చెవి కచ్చితంగా కుట్టేవారు.
కర్ణ వేద సంస్కారం అంటే చెవులు కుట్టే వేడుక. 16 సంస్కారాల్లో కర్ణ వేద సంస్కారం ఒకటి. 8 సంస్కారాల తర్వాత తొమ్మిదవది ఇది. పిల్లలు ఆరవ నెలలో ఉన్నప్పుడు దీనిని జరుపుతారు. చెవులు కుట్టించడం వెనుక మతపరమైన, సాంస్కృతిక, ఆరోగ్య ప్రయోజనాలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. పిల్లల వికాసానికి కర్ణ వేద సంస్కారం అవసరం. చెవులు కుట్టడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
చెవులు కుట్టించుకోవడం వలన వినికిడి శక్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగు పడుతుంది. మెదడు సామర్థ్యం పెరుగుతుంది. ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
16 సంస్కారాలలో కర్ణ వేద సంస్కారం ఒకటి. ఎనిమిది సంస్కారాలు చేసాక ఆరవ నెలలో దీనిని జరుపుతారు. చాలామంది జ్యోతిష్యులు చెవులు కుట్టించుకుని బంగారం ధరించమని చెప్తారు. పూర్వకాలంలో రాజు, మహర్షి ఇలా ఎవరైనా చెవులు కుట్టించుకునేవారు.
ఇప్పుడు అమ్మాయిలు చెవులు కొట్టించుకోవడం ఫ్యాషన్ గా మారింది. చెవులు కుట్టించుకోవడం వలన మెదడు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మేధస్సు పెరుగుతుంది. చిన్నతనంలో పిల్లలకు చెవులు కుట్టించి తర్వాత చదువుకోడానికి పంపించేవారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.