గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచే మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. జూన్ నెలలో మొత్తం నాలుగు గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. సూర్యుడు, కుజుడుతో పాటు ఇంకో రెండు గ్రహాల సంచారంలో మార్పు వుంది . దీని కారణంగా అనేక రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారికి ఈ గ్రహాల సంచారంతో అదృష్టం కలిసి రాబోతోంది; మరికొంతమంది కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు లాంటి ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు వున్నాయి. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.
ఈ నెలలో గ్రహాలకు రాజైన సూర్యుడు, మిత్ర గ్రహమైన బుధుడు రాశి అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంతేకాదు, బుధుడు, కుజుడు, శుక్రుడు కూడా వివిధ తేదీలలో రాశిని మార్చుతున్నారు. జూన్ నెలలో ఈ గ్రహాల మార్పు వలన కొన్ని రాశుల వారికి కలిసి రాబోతోంది. ఈ మార్పు వలన కొన్ని రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రాశుల వారికి మానసిక ఒత్తిడి, గందరగోళం, ఆర్థిక అస్థిరతల వంటి ప్రభావాలు ఉండవచ్చు.
జూన్ 8న సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూన్ 22న ఆరుద్ర నక్షత్రంలో సూర్య సంచారం జరుగుతుంది. బుధుడు జూన్ 9న ఆరుద్ర నక్షత్రం, జూన్ 16న పునర్వసు నక్షత్రంలో, జూన్ 25న పుష్యమి నక్షత్రంలో సంచరిస్తాడు. శుక్రుడు జూన్ 13న భరణిలోకి, జూన్ 26న కృత్తికలో సంచరిస్తాడు. కుజుడు జూన్ 7న మఖ, జూన్ 30న పుబ్బలో సంచరిస్తాడు. గురువు జూన్ 14న ఆరుద్రలో సంచరిస్తాడు.
ఈ గ్రహాల మార్పు వలన మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. టెన్షన్ కూడా ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కొన్ని ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో మార్పుల వలన కాస్త అసౌకర్యంగా ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ కుటుంబ సభ్యులతో ఓపెన్‌గా మాట్లాడి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.
వృషభ రాశి వారు జూన్ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి పెద్ద ఆలోచనలను రానివ్వకండి. ఉద్యోగంలో మార్పు, ఇన్వెస్ట్మెంట్ వంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కాస్త సహనంతో వ్యవహరించండి. ఒకవేళ ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోండి.
కర్కాటక రాశి వారు జూన్ నెలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ నెలలో చిన్నపాటి సమస్యలు ఎదురవవచ్చు. ధ్యానం, యోగ వంటి వాటిపై ఫోకస్ చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.
సింహ రాశి వారికి అదృష్టం పెద్దగా ఉండదు. కానీ కష్టపడి పని చేస్తే అనుకున్నది సాధించవచ్చు. సపోర్ట్ దొరకకపోవడంతో కాస్త ఇబ్బందికి గురవుతారు. సహనంతో వ్యవహరిస్తే అన్నింటా విజయాలను పొందవచ్చు.
మీన రాశి వారు జూన్ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువవుతుంది, కాబట్టి ఆచితూచి వ్యవహరించండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్