కార్తీక మాసం ఆరుద్రా నక్షత్ర విశేషం.. శివ పూజ ఎలా చేయాలి?-importance of arudra nakshatra and puja vidhi in karthika masam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కార్తీక మాసం ఆరుద్రా నక్షత్ర విశేషం.. శివ పూజ ఎలా చేయాలి?

కార్తీక మాసం ఆరుద్రా నక్షత్ర విశేషం.. శివ పూజ ఎలా చేయాలి?

Anand Sai HT Telugu
Nov 28, 2023 06:36 PM IST

Arudra Nakshatra Importance : ఆరుద్రా నక్షత్ర విశేషం గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపాడు. ఆరోజున శివుడికి చేసే పూజా విధానం గురించి వెల్లడించారు.

కార్తీక మాసం పూజా
కార్తీక మాసం పూజా

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆరుద్రా నక్షత్రము శివునికి అత్యంత ప్రీతకరమైన నక్షత్రమని, రుద్ర సంబంధిత నక్షత్రము ఆరుద్రా నక్షత్రమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పురాణాల ప్రకారం కూడా ఆరుద్రా నక్షత్రములో శివుడు జన్మించినట్లుగా ఇది శివుని నక్షత్రంగా చెప్పబడింది. ఇటువంటి ఆరుద్రా నక్షత్రము ఉన్న సమయంలో చేసే శివారాధనకు విశేషమైన ఫలితాలుంటాయని శాస్త్రాలు తెలియచేసినట్లుగా చిలకమర్తి చెప్పారు.

కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసములో ఏరోజు శివారాధన చేసినా అదే విశేషమే. వారాలలో కార్తీక సోమవారం వంటి ప్రత్యేక రోజులనాడు తిథులలో ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి వంటి తిథులనాడు నక్షత్రాలలో ఆరుద్రా వంటి నక్షత్రాలు కలిగిన రోజులలో చేసేటటువంటి శివారాధన అత్యంత విశేష ఫలదాయకమని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ పేర్కొన్నారు.

ఈ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్‌ సిద్ధాంత పంచాంగ గణితంగా ఆధారంగా 30 నవంబర్‌ 2023 కార్తీక మాస బహుళ పక్ష తదియ తిథి గురువారం ఆరుద్రా నక్షత్రము ఉండటంచేత ఈరోజు శివాలయాలలో చేసే అభిషేకాలకు, స్వగ్రహమునందు చేసే శివారాధనకు ఈరోజు ఆచరించే కార్తీక మాస నియమాలకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని చిలకమర్తి తెలియజేశారు.

ఈరోజు శివాష్టకం బిల్వాష్టకం వంటివి పఠించడం, శివారాధాన వంటివి చేయడం వలన శివుని అనుగ్రహం లభిస్తుందని ఈరోజు శివునికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం బిల్వ దళాలతో పూజించడం వలన శివానుగ్రహం పొందవచ్చని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel