సక్సెస్ అందని ద్రాక్ష అయ్యిందా? అయితే ఇలా చేయండి అది మీ ముంగిట్లో ఉంటుంది
కొంతమంది ఏదైనా పని తలపెడితే ఆదిలోనే ఆగిపోవడం. ఎంత కష్టపడినా అందులో విజయం సాధించలేకపోవడం జరుగుతుంది. అదృష్టం లేకపోవడం వల్ల సక్సెస్ కాలేకపోతున్నారని అనుకుంటారు. కానీ మీరు చేసే చిన్న తప్పిదాలు విజయాన్ని దూరం చేస్తాయని మీకు తెలుసా?
కొన్ని సార్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన సక్సెస్ అందుకోవడం చాలా కష్టం అవుతుంది. అది అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. మీరు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అయితే దీనికి సంబంధించి వాస్తు ప్రకారం కొన్ని పనులు చేయడం మంచిది.
జీవితం నుండి అడ్డంకులను తొలగించడానికి వాస్తు చిట్కాలుఉన్నాయి. ఇవి పాటించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కలిసి వస్తాయి. కొన్ని వాస్తు దోషాల కారణంగా వ్యక్తి పురోగతి మార్గంలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. ఒక వ్యక్తి శక్తి, విశ్వాసం లేకపోవడాన్ని అనుభవిస్తాడు. ఏ పని చేయాలనే భావన లేదు. ప్రతిరోజూ తెలిసి, తెలియక చేసే తప్పుల వల్ల జీవితంలో సవాళ్లు తప్పవు. అవి మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టేస్తాయి. విజయావకాశాలు చేజారేలా చేస్తాయి. చూసేందుకు చిన్నగా అనిపించే కొన్ని విషయాలు జీవితం మీద పెద్ద ప్రభావాన్ని చూపుతాయి.
వాస్తు దోషాల కారణంగా ఉద్యోగ ప్రమోషన్‌లో విజయం సాధించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా పురోగతికి వచ్చే అడ్డంకులను నివారించవచ్చు. ఎలాంటి తప్పులు విజయాన్ని సాధించడంలో అడ్డంకిగా మారతాయి, వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటే చాలు సక్సెస్ మీ ముంగిట్లో ఉంటుంది.
అడ్డంకులను తొలగించే వాస్తు చిట్కాలు
ఇంట్లో చెప్పులు, బూట్లు ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు. వాటిని ఎప్పుడూ స్టాండ్ లో క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి. లేదంటే ఇలాంటి పని వల్ల మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చని నమ్ముతారు.
స్నానం చేసిన తర్వాత నీటిని చాలా మంది బకెట్ అడుగున కొద్దిగా నీరు వదిలిపెట్టేసి వస్తారు. కానీ అలా చేయడం అసలు మంచిది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని పట్టించుకోకుండా వదిలేస్తే అది వ్యక్తికి మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.
కొంతమంది చెప్పులు ఈడుస్తూ సౌండ్ చేస్తూ నడుస్తారు. అది వారికి ఎలా ఉంటుందో తెలియదు కానీ పక్కన ఉన్న వాళ్ళకు వినడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు మీ పాదాలను లాగుతూ నడుస్తుంటే ఈ పొరపాటు విజయ మార్గంలో అడ్డంకులను కూడా సృష్టిస్తుందనే విషయం తెలుసుకోండి.
వాస్తు ప్రకారం వంటగదిని శుభ్రంగా ఉంచకపోతే ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వంట గది శుభ్రత చాలా ముఖ్యం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎల్లప్పుడూ ఇంటిని చక్కగా పెట్టుకోవాలి.
మీకు అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే అలవాటు ఉంటే చంద్ర దోషాలను కలిగించవచ్చు. దీని కారణంగా జీవితంలో ఒత్తిడి, డిప్రెషన్ తలెత్తుతాయి.
మీరు తిన్న తర్వాత మురికి ప్లేట్ లేదా పాత్రను అక్కడ ఉంచినట్లయితే ఈ పొరపాటు పనిలో అవరోధాలను సృష్టిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్