Hanuman jayanti 2024: ఈ హనుమంతుడి ఫోటో మీ ఇంట్లో పెట్టారంటే ఇక మీకు ఏ భయాలు ఉండవు, అష్టైశ్వర్యాలే-if you put this photo of hanuman in your house as per vastu you will have no more fear ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Hanuman Jayanti 2024: ఈ హనుమంతుడి ఫోటో మీ ఇంట్లో పెట్టారంటే ఇక మీకు ఏ భయాలు ఉండవు, అష్టైశ్వర్యాలే

Hanuman jayanti 2024: ఈ హనుమంతుడి ఫోటో మీ ఇంట్లో పెట్టారంటే ఇక మీకు ఏ భయాలు ఉండవు, అష్టైశ్వర్యాలే

Gunti Soundarya HT Telugu
Apr 22, 2024 10:38 AM IST

Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి ఈ ఫోటో పెట్టుకున్నారంటే జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. వాస్తు ప్రకారం ఏ దిశలో హనుమంతుడి ఫోటో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

హనుమాన్ జయంతి 2024
హనుమాన్ జయంతి 2024 (pinterest)

Hanuman jayanti 2024: ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 23న జరుపుకోనున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మీరు కూడా ఇంట్లో హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే వాస్తుకు సంబంధించి కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

వాస్తు ప్రకారం దేవుళ్ళు, దేవతల విగ్రహాలను ఇంట్లో ప్రతిష్టించడం వల్ల పూర్తి ఫలితం లభిస్తుందని నమ్ముతారు. హనుమంతుడి విగ్రహం ఏ దిశలో ఉండాలని విషయం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే వాస్తు లోపాల వల్ల వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి విగ్రహాన్ని ఏ దిశలో పెడితే  ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. 

వాస్తు ప్రకారం హనుమంతుడి విగ్రహం లేదా చిత్రాన్ని పూజ గదిలో దక్షిణ దిశలో ఉంచాలి. ఈ దిశలో ఫోటో పెట్టేటప్పుడు హనుమాన్ కూర్చున్న భంగిమలో ఉన్న ఫోటో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. 

వాస్తు ప్రకారం పడక గదిలో హనుమంతుడి ఫోటో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది వాస్తు దోషానికి దారితీస్తుంది. అందుకే పొరపాటున కూడా హనుమంతుడి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పడకగదిలో ఉంచుకోకూడదు. ఎందుకంటే హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. 

వాస్తు ప్రకారం హనుమంతుని చిత్రపటం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పూజిస్తూ మంగళవారం సుందరకాండ పారాయణం చేయాలి. అప్పుడే మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి.

ఇంట్లోని చీడ,పీడలను, దుష్టశక్తులను వదిలించుకోవడానికి ఇంటి దక్షిణ దిశ గోడపై కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి చిత్రపటాన్ని తగిలించుకోవచ్చు. ఈ చిత్రపటంలో హనుమంతుడు ఎరుపు రంగులో ఉండే విధంగా చూసుకోవాలి. 

వాస్తు ప్రకారం మెట్ల కింద, వంట గదిలో హనుమంతుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచకూడదు. అలా చేశారంటే అది సమస్యలను తీసుకొస్తుంది. 

శత్రువులు, గృహ బాధలు, సంబంధాల్లో విభేదాలు, కుటుంబంలో ప్రతికూలతలు నివారించేందుకు పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి.  పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ప్రధాన ద్వారంపైన ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంటి నుండి దూరంగా ఉంటుందని భక్తుల విశ్వాసం.

ఇంట్లోనే డ్రాయింగ్ రూమ్ లో శ్రీరామ దర్బార్ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. వీటితోపాటు పంచముఖ ఆంజనేయస్వామి, హనుమంతుడు పర్వతాన్ని ఎత్తుతున్న ఫోటోను కూడా ఈ గదిలో ఉంచుకోవచ్చు. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. 

ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కోసం హనుమంతుడి బొమ్మను ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే హనుమంతుని శరీరంపై తెల్ల వెంట్రుకలు ఉన్న ఫోటో ఎంచుకుంటే మరీ మంచిది. 

హనుమంతుడిని పూజించడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ఈరోజు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. హనుమంతుడికి నీరు సమర్పించిన  తర్వాత పంచామృతాన్ని నైవేద్యంగా పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 

నువ్వుల నూనెలో నారింజ పచ్చిమిర్చి కలిపి నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించాలి. అంతే కాకుండా బెల్లం లేదా గోధుమపిండితో చేసిన రోటి సుర్మాను  నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల భజరంగబలి సంతోషించి భక్తులకు సుఖసంతోషాలతో ప్రసాదిస్తాడని నమ్ముతారు.

 

 

WhatsApp channel