ముఖంపై ఈ 4 చోట్ల పుట్టుమచ్చలు ఉంటే.. మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు!-if you have moles on the face at these 4 places then you are very lucky ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ముఖంపై ఈ 4 చోట్ల పుట్టుమచ్చలు ఉంటే.. మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు!

ముఖంపై ఈ 4 చోట్ల పుట్టుమచ్చలు ఉంటే.. మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు!

Peddinti Sravya HT Telugu

మనకి ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టుమచ్చలు ఆధారంగా మనిషి ప్రవర్తన, భావాలు, భవిష్యత్తు, అదృష్టం, లాభాలు వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ముఖంపై ఈ 4 చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టవంతులు అని చెప్పవచ్చు. మరి మీరూ లక్కీ ఏమో చూసుకోండి.

ముఖంపై ఈ 4 చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టవంతులు (pinterest)

సాముద్రిక శాస్త్రం ద్వారా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టుమచ్చలు ఆధారంగా మనిషి ప్రవర్తన, భావాలు, భవిష్యత్తు, అదృష్టం, లాభాలు వంటి విషయాలను తెలుసుకోవచ్చు. సాధారణంగా మనకి శరీరంపై అనేక పుట్టుమచ్చలు ఉంటాయి.

ముఖంపై కూడా చాలా మందికి ఎక్కువగా పుట్టుమచ్చలు ఉంటాయి. అయితే, ఈరోజు ముఖం పై ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా అవి తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీ పుట్టుమచ్చల వెనుక ఉన్న రహస్యం తెలుసుకోండి.

ముఖంపై ఉన్న పుట్టుమచ్చలు వెనుక అర్ధం ఏంటో తెలుసుకోండి

ముఖంపై ఉన్న పుట్టుమచ్చలు అందంగా కనపడేలా చేస్తాయి. ముఖం పై ఉన్న పుట్టుమచ్చులు ద్వారా భవిష్యత్తు, భావాలు, అదృష్టం ఇలా అనేక విషయాలని తెలుసుకోవచ్చు.

1.నుదురుపై పుట్టుమచ్చ

సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదుటిపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావించడం జరిగింది. నుదిటిపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు ప్రశాంతంగా ఉంటారు. ఈ వ్యక్తులు తెలివైన వారు కూడా. ఈ పుట్టుమచ్చ వారి అదృష్టాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వ్యక్తులు ఎక్కువగా కష్టపడి పని చేసి, గుర్తింపును తెచ్చుకుంటారు.

2.పెదవులపై పుట్టుమచ్చ

పెదవులు పై పుట్టుమచ్చ ఉన్నట్లయితే మీరు చాలా అందంగా ఉంటారు. బాగా మాట్లాడుతారు. మీ మాటలు కూడా మధురంగా ఉంటాయి. మీరు భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. ఎంతో సపోర్ట్ ఇస్తారు. కుటుంబంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి.

3.ముక్కుపై పుట్టుమచ్చ

అదే ఒకవేళ ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే దీనిని అదృష్టంగా భావిస్తారు. ఈ పుట్టుమచ్చ ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒకరికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంతో కష్టపడి పని చేస్తారు.

4.బుగ్గలపై పుట్టుమచ్చ

అదే ఒకవేళ బుగ్గలపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం మీరు ఇతరులతో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. చాలా క్రియేటివిటీ ఉంటుంది. ఇతరుల హృదయాలని ఎప్పుడూ గెలుచుకుంటూ ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.