Moles Astrology: అక్కడ పుట్టుమచ్చ ఉంటే.. భార్య మూలంగా ఆకస్మిక ధనలాభం!
Moles Astrology: మన శరీరంపై ఉండే పుట్టుమచ్చలు అందాన్ని పెంచడమే కాదు.. తరచి చూస్తే మనకి అదృష్టాన్ని ఇచ్చే సంకేతాలు కూడా ఇస్తాయని సాముద్రిక శాస్త్రం నిపుణులు చెప్తున్నారు. శరీరంలోని వివిధ భాగాల్లో ఉండే పుట్టుమచ్చల ఆధారంగా వ్యక్తుల స్వభావాలను కూడా సులువుగా అంచనా వేయొచ్చట.
Moles Astrology In Telugu: సాధారణంగా ముఖంపై ఎవరికి పుట్టుమచ్చ ఉన్నా.. అవి వారి అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. అయితే.. ముఖంలోని కొన్ని భాగాల్లో పుట్టుమచ్చ అదృష్టానికి సంకేతాలట. సరిగ్గా నుదిటి భాగాన పుట్టుమచ్చ ఉంటే.. అతను పరోపకారిగా నిత్యం పది మందిలో తిరుగుతూ సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాడు. సరిగ్గా కనుబొమ్మలకి మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అతను దీర్ఘాయుష్మంతుడు అవుతాడని సాముద్రిక శాస్త్రం చెప్తోంది.
పురుషుడికి కుడివైపున నడుముకు కాస్త కింద భాగంలో పుట్టుమచ్చ ఉండే జీవితంలో ఏ లోటూ లేకుండా జీవనం సాగిస్తాడు. అదే మహిళకి ఎడమ వైపు నడుము మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతురాలు అవ్వడమే కాకుండా.. నిత్యం ఆకర్షనీయమైన వ్యక్తిత్వంతో జీవనం సాగిస్తుందని సాముద్రిక శాస్త్రం చెప్తోంది.
పురుషుడికి కుడి కనుబొమ్మ మీద పుట్టుమచ్చ ఉంటే.. అతనికి చాలా తొందరగా వివాహం జరగడమే కాకుండా భార్య మూలంగా ఆకస్మిక ధనలాభం పొందుతాడు. కుడి కంటి లోపల ఒకవేళ పుట్టుమచ్చ ఉంటే అతను డబ్బుకి లోటు ఉండదని.. నిత్యం స్థిరాస్థులు కొనుగోలు చేస్తుంటాడని సాముద్రిక శాస్త్రం నిపుణులు చెప్తున్నారు.
పెదాలపై పుట్టుమచ్చల గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నా.. సాముద్రిక శాస్త్రం ప్రకారం పైపెదవిపై పుట్టుమచ్చ ఉంటే వారిలో లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయి. అదే కింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే వారు పేదరికంతో నిత్యం దోస్తీ చేయక తప్పదని సాముద్రిక శాస్త్రం నిపుణులు చెప్తున్నారు.
పురుషులకి మెడ ముందు భాగంలో ఏవైపునా పుట్టుమచ్చ ఉన్నా మంచిదే. కానీ మెడ కింద భాగం నుంచి పాదం వరకూ కుడివైపున మచ్చలు ఉంటేనే అదృష్టమని సాముద్రిక నిపుణులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా కుడివైపు భుజం, మోచేతి, అరచేయి, తొడ, మోకాలుపై మచ్చ ఉంటే .. జీవితంలో కష్టపడటం ద్వారా లేదా కాలం కలిసి రావడం ద్వారా ధనవంతుడు అవుతాడు. అదే మహిళైతే ఈ మచ్చలన్నీ ఎడమవైపున ఉంటే అదృష్టం.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిపై అంచనాకి వచ్చే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్