స్నానం చేసిన వెంటనే ఈ ఐదు పనులు చేస్తే పేదరికం మీ ఇంటి తలుపు తడుతుంది, రాహు కేతువులు కలిసి వస్తారు-if you do these five things immediately after taking a bath poverty will knock on your door rahu and ketu effects ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  స్నానం చేసిన వెంటనే ఈ ఐదు పనులు చేస్తే పేదరికం మీ ఇంటి తలుపు తడుతుంది, రాహు కేతువులు కలిసి వస్తారు

స్నానం చేసిన వెంటనే ఈ ఐదు పనులు చేస్తే పేదరికం మీ ఇంటి తలుపు తడుతుంది, రాహు కేతువులు కలిసి వస్తారు

Haritha Chappa HT Telugu

స్నానం చేసిన తర్వాత ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదు. రాహుకేతువులను కలిసి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు.

స్నానం చేశాక చేయకూడని పనులు (pixabay)

హిందూ సంప్రదాయంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్నానం చేశాక మీరు చేసే పనులు కొన్ని కీడును చేస్తాయి. ముఖ్యంగా రాహు కేతువులకు ఇంట్లోకి ఆహ్వానం పలుకుతాయి.

స్నానం అనేది శరీరం, మనసును శుద్ధి చేసే ప్రక్రియ. ఇది ప్రతికూల శక్తిని శరీరం నుండి మనసు నుండి నాశనం చేస్తుంది. అందుకే ఏదైనా శుభకార్యం లేదా పూజా చేసేముందు ఒక వ్యక్తి అభ్యంగన స్నానం చేయమని చెబుతారు.

స్నానం చేశాక చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. వీటిని శాస్త్రాలలో అశుభమైనవిగా పేర్కొంటారు. స్నానం చేసిన తర్వాత ఇలాంటి పనులు చేయడం వల్ల రాహుకేతువులు చెడు దృష్టి మీ ఇంటి పై పడుతుందని అంటారు. కాబట్టి స్నానం తర్వాత చేసే ఈ పనులు మీ ఇంటికి దురదృష్టాన్ని, పేదరికాన్ని తెస్తాయి. ఎలాంటి పనులు స్నానం చేసిన తర్వాత చేయకూడదో తెలుసుకోండి.

బకెట్ లో నీళ్లు వదిలేయడం

స్నానం చేశాక ఎంతోమంది కొంత నీటిని బకెట్లో వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంటి వాస్తు చెడిపోతుంది. రాహుకేతువులు ప్రతికూలంగా మారుతారు. అంతేకాదు వారు బలంగా మారి చురుగ్గా ప్రభావాన్ని చూపిస్తారు. దీనివల్ల మీరు సంపాదించిన డబ్బు వృధా అయిపోతుంది. అలాగే పేదరికం, దురదృష్టం వంటివి ప్రవేశిస్తాయి. కాబట్టి బకెట్లో ఉన్న మిగిలిన నీటిని వంపేసి ఖాళీ బకెట్ ను ఉంచండి. లేదా బకెట్లో శుభ్రమైన నీటితో నింపండి. అంతేతప్ప స్నానం చేశాక సగం నీరు బకెట్లో వదిలేయకండి.

రాలిపోయిన జుట్టు

స్నానం చేసేటప్పుడు కొంత జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ జుట్టును అలా బాత్రూంలోనే వదిలేస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అశుభం. ఇలా చేయడం వల్ల శని దేవుడు, అంగారకుడుకి కోపం వస్తుంది. చేసే పనులను మీరు చెడగొడతారు. ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తారు. కాబట్టి బాత్రూంలో జుట్టు పడిపోతే వెంటనే ఎప్పటికప్పుడు తీసి బయటపడేస్తూ ఉండండి.

చెప్పులు వేసుకుని స్నానం

ఎంతోమంది బాత్రూంకు చెప్పులు వేసుకుని వెళుతూ ఉంటారు. అయితే స్నానం చేసేటప్పుడు చెప్పులు ధరించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే ఆ వ్యక్తికి రాహుకేతువులు మాత్రమే కాదు వాస్తు కూడా హాని కలిగిస్తుంది. చెప్పులు తీశాకే స్నానం చేయాలి. చెప్పులతో ఎప్పుడూ స్నానం చేయడానికి ప్రయత్నించకండి.

బాత్రూంలోనే తడి బట్టలు

స్నానం చేసిన తర్వాత తమ తడి బట్టలను బాత్రూంలో వదిలి వేసేవారు ఎంతోమంది. ఇది ఆ ఇంటి వాస్తు పాడు చేసే అలవాటు. అంతేకాదు ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవహించేలా చేస్తుంది. ఆ ఇంట్లో, వారి పరిస్థితిలో ఆరోగ్యం దిగజారి పోతాయి. మనసు కూడా చంచలంగా మారిపోతుంది. అందుకే బాత్రూంలో తడి బట్టలు ఎప్పుడూ వదిలేయకండి. ఇది మీ జాతకంలో చంద్రుడిని చెడగొడుతుంది.

విప్పిన బట్టలు ఉతకడం

చాలామంది స్నానం చేసిన తర్వాత విప్పిన బట్టలను ఉతుకుతూ ఉంటారు. ఈ పని ఎప్పుడూ చేయకండి. విప్పిన బట్టలను ముందుగా ఉతికిన తర్వాతే స్నానం చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన తర్వాత మురికి బట్టలు ఉతకడం అనేది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచేస్తుంది.

సింధురం ధరించడం

స్నానం చేసిన తర్వాత మహిళలు సింధూరాన్ని నుదుటిపై జుట్టు మధ్యలో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి భర్త ఆయుష్షు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేశాక దుస్తులు ధరించి పూర్తిగా సిద్ధమైన తర్వాతే చివరిలో కుంకుమను నుదుటికి పెట్టుకోండి.

(గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తి నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పడం లేదు. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణలు సలహా తీసుకోవడం మంచిది.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం