Goddess lakshmi devi blessings: ఈ ఒక్క పువ్వుతో పూజ చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి-if you do puja with this single flower all your problems will be removed ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Lakshmi Devi Blessings: ఈ ఒక్క పువ్వుతో పూజ చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి

Goddess lakshmi devi blessings: ఈ ఒక్క పువ్వుతో పూజ చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి

Gunti Soundarya HT Telugu
Jul 19, 2024 09:36 AM IST

Goddess lakshmi devi blessings: శుక్రవారం రోజు ఈ ఒక్క పువ్వు లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వల్ల మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవించగలుగుతారు.

పూజకు మందారం ఉపయోగిస్తే కలిగే ఫలితాలు ఇవే
పూజకు మందారం ఉపయోగిస్తే కలిగే ఫలితాలు ఇవే (Unsplash)

Goddess lakshmi devi blessings: పూజలో పూలకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని నిత్యం పూజలో ఉపయోగించడం వల్ల అందరి దేవతల ఆశీర్వాదాలు పొందేందుకు ఉపయోగపడతాయని అంటారు. అయితే వాస్తు ప్రకారం కూడా పువ్వులు అదృష్టంతో ముడిపడి ఉన్నాయి. సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు.

సంబంధిత ఫోటోలు

ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితంతో పాటు అనేక సమస్యల నుంచి బయట పడేందుకు వాస్తు శాస్త్రంలో పరిహారాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం వల్ల జీవితం సాఫీగా సాగుతుంది. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ పువ్వుతో శుక్రవారం పూజ చేసి చేయండి. 

మందార పువ్వుతో కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ పనుల్లోని ఆటంకాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలతో పూజ చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు. వాస్తు ప్రకారం మందార పువ్వుతో  ఇలా చేయండి. 

రుణ బాధలు తొలగించుకునేందుకు

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ సులభమైన పరిష్కారం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది. శుక్రవారం వినాయకుడిని, దుర్గామాతను పూజించి ఐదు మందార పువ్వులను సమర్పించాలి. ఇలా కనీసం వారం రోజులు పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అప్పుల సమస్యలను వచ్చి బయటపడతారు. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. 

డబ్బు కొరత అధిగమించేందుకు

ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బులు కొరత ఏర్పడుతున్నట్లయితే ఈ పరిహారం పాటించి చూడండి. సూర్యదేవుడిని పూజించేటప్పుడు మందార పువ్వులు సమర్పించాలి. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో రాగి పాత్రలో నీటిలో మందార పువ్వులు వేసి పూజ చేయాలి. ఇలా చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి.

ఇంట్లో శాంతి కోసం

ఇంట్లో తరచూ గొడవలతో  అశాంతికరమైన వాతావరణం నెలకొంటుందా అయితే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. మందార మొక్కను ఇంట్లో నాటడం వల్ల సానుకూలత ఏర్పడుతుంది. అయితే సరైన దిశలోనే ఈ మొక్కను నాటాలి. మందార పువ్వు మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటాలి. అలాగే ఈ మొక్కను ఎప్పుడూ సంరక్షించుకుంటూ ఉండాలి. మొక్క ఎండిపోకూడదు. ఒంటి రెక్క మందార పూలు ఉన్న మొక్క నాటడం వల్ల మరిన్ని శుభప్రయోజనాలు కలుగుతాయి.

వైవాహిక జీవితం కోసం

ఆర్థికపరమైన సమస్యలతో పాటు వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను తొలగించుకునేందుకు ఈ మందార పువ్వు పరిహారం సహాయపడుతుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న అపోహలను, అపార్థాలను తొలగించేందుకు మీరు దిండు కింద మందార పువ్వు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రేమ భావన పెరుగుతుంది. జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. 

విజయం కోసం

వృత్తి, వ్యాపారంలో పురోభివృద్ధి కోసం మందార పువ్వులు, మిఠాయిలు కలిపి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

 

Whats_app_banner