రథయాత్రకు వెళ్ళలేని వారు ఇంట్లో ఇలా చేస్తే జగన్నాధుని ప్రత్యేక ఆశీస్సులను పొందవచ్చు!-if you cannot go to ratha yatra these do this at home for jagannath special blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  రథయాత్రకు వెళ్ళలేని వారు ఇంట్లో ఇలా చేస్తే జగన్నాధుని ప్రత్యేక ఆశీస్సులను పొందవచ్చు!

రథయాత్రకు వెళ్ళలేని వారు ఇంట్లో ఇలా చేస్తే జగన్నాధుని ప్రత్యేక ఆశీస్సులను పొందవచ్చు!

Peddinti Sravya HT Telugu

జూన్ 27, ఆషాఢ శుక్ల ద్వితీయ నుండి ఇక్కడ రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్రలో పాల్గొనడానికి మీకు వీలు లేకపోతే, రథయాత్ర చూడడానికి వెళ్లలేని వారు ఇంట్లోనే ఇలా చేయవచ్చు. ఇలా చేయడం వలన పూరి జగన్నాథుని అనుగ్రహం కలుగుతుంది, సంతోషంగా ఉండవచ్చు.

జగన్నాథ్ ఆలయం

పూరీలో జరుగుతున్న రథయాత్రను చూడడానికి దేశ విదేశాల నుండి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు. జూన్ 27, ఆషాఢ శుక్ల ద్వితీయ నుండి ఇక్కడ రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్రలో పూరి జగన్నాథుడితో పాటు సుభద్రా దేవి, బలరాముడిని కూడా రథాలపై ఊరేగిస్తారు.

రథాలను తీసుకు వెళ్తున్నప్పుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. రథాలను లాగితే జనన మరణ చక్రాల నుండి విముక్తి లభిస్తుంది. చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందవచ్చు. పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. రథయాత్రలో పాల్గొనడానికి మీకు వీలు లేకపోతే, రథయాత్ర చూడడానికి వెళ్లలేని వారు ఇంట్లోనే ఇలా చేయవచ్చు. ఇలా చేయడం వలన పూరి జగన్నాథుని అనుగ్రహం కలుగుతుంది, సంతోషంగా ఉండవచ్చు.

రథయాత్రకు వెళ్లలేని వారు ఇంట్లో ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది:

పూరి జగన్నాథుని ఇంట్లో ఈ విధంగా ఆరాధించండి. రథయాత్రకు వెళ్లలేని వారు ఇంట్లో ఇలా చేయవచ్చు. ఇలా చేయడం వలన జగన్నాధుని ప్రత్యేక అశీసులు పొందవచ్చు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

  1. రథయాత్రకు వెళ్లలేని వారు ఇంట్లో స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని గంగాజలంతో శుద్ధి చేయాలి.
  2. ఆ తర్వాత పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరచి జగన్నాథుడు, బలరాముడు, సుభద్రా దేవి విగ్రహాలను ప్రతిష్టించాలి.
  3. శంఖం ఊదుతూ, గంటను మోగిస్తూ పూజను ప్రారంభించాలి.
  4. జగన్నాథ స్వామికి పంచామృతాలను సమర్పించాలి.
  5. ఆ తరవాత కొత్త బట్టలతో అలంకరించాలి.
  6. భగవంతుని చిత్రపటం ఉంటే దానిపై పవిత్ర జలాన్ని జల్లాలి.
  7. కుంకుమ, చoదనం, పూలు, అక్షింతలు సమర్పించాలి. అలాగే నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మంచిది.
  8. జగన్నాథుని ఇష్టమైన కిచిడీ, స్వీట్లు, పండ్లు వంటి వాటిని నైవేద్యంగా పెట్టవచ్చు.
  9. పూజ సమయంలో జగన్నాథుని మంత్రాలను జపించాలి.
  10. చివరిగా హారతి ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.