Dharma Sandehalu: పుట్టింటి నుంచి ఈ వస్తువులు తెచ్చుకుంటే దీర్ఘకాలం సుమంగళిగా ఉంటారు.. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు
Dharma Sandehalu: అత్తవారింట్లో ఏ ఇబ్బంది ఎదుర్కోకూడదని, వారికి తోచినవి, అమ్మాయి అడిగినవి ఇలా చాలా సామాన్లు, చాలా ఆహార పదార్థాలు మొదలైనవి ఎవరికి తోచినవి వారు ఇస్తూ ఉంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి ఈ వస్తువులని తీసుకురాకూడదు.

పెళ్లి తర్వాత ప్రతీ ఆడపిల్లా కూడా పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లి పోవాల్సిందే. అయితే పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లిపోయేటప్పుడు కొన్ని వస్తువులని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదు. పుట్టింటి నుంచి అత్త ఇంటికి వెళ్లేటప్పుడు ఎటువంటి వస్తువులని తీసుకువెళ్లకూడదు?, వాటి వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టింటి వారు అమ్మాయికి ఏ లోటు ఉండకూడదని, అత్తవారింట్లో ఏ ఇబ్బంది ఎదుర్కోకూడదని, వారికి తోచినవి, అమ్మాయి అడిగినవి ఇలా చాలా సామాన్లు, చాలా ఆహార పదార్థాలు మొదలైనవి ఎవరికి తోచినవి వారు ఇస్తూ ఉంటారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి ఈ వస్తువులని తీసుకురాకూడదు. ప్రతీ మహిళ కూడా పుట్టింటి నుంచి అత్త ఇంటికి వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోవాలి.
పుట్టింటి నుంచి ఆడపిల్ల తెచ్చుకోకూడనివి
- చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు కిరాణా సామాన్లు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అయితే కిరాణా సామాన్లు ఇచ్చేటప్పుడు అందులో ఉప్పు, చింతపండు లేకుండా చూసుకోవాలి. ఈ రెండు కూడా కుటుంబాల మధ్య సంబంధాలను తెంచేస్తాయి. ఈ రెండిటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోకూడదు.
- అలాగే కత్తిపీట, కత్తెరలు, కత్తులు, సూదులు వంటివి కూడా ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకెళ్లకూడదు. ఇటువంటివి తెచ్చుకోవడం వలన కుటుంబాల మధ్య మనస్పర్ధలు పెరగడమే కాదు.. పగలు, ప్రతీకారాలు కూడా పెరుగుతాయి.
- అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఏ స్త్రీ కూడా పుట్టింటి నుంచి చేట, చీపురు తీసుకువెళ్లకూడదు. ఈ రెండు లక్ష్మీదేవికి చిహ్నాలు. కాబట్టి వీటిని కూడా అస్సలు తీసుకు వెళ్ళకూడదు. వీటిని తీసికెళ్తే పేదరికం పాలవుతారు.
- అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆడపిల్ల అగ్గి పెట్టెని కూడా తీసుకు వెళ్ళకూడదు.
- పాలు, పెరుగు, నూనె, దూది, గొడుగు, నల్ల బట్టలు, లక్ష్మీదేవి రూపు, అద్దం వంటి వస్తువులని కూడా తీసికెళ్ళకూడదు.
- పుట్టింటి నుంచి నూనెను తెచ్చుకోవడం అత్తింటి వారికి అరిష్టాన్ని కలిగిస్తుంది. ఉప్పు తెచ్చుకోవడం కూడా అరిష్టమే. కాబట్టి అసలు ఈ వస్తువులని అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఏ ఆడపిల్ల కూడా తీసుకు వెళ్ళకూడదు.
పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువులు
- పుట్టింటి దగ్గర నుంచి బెల్లం తెచ్చుకుంటే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. బెల్లానికి ఎంతో శక్తి ఉంది ఉంది. పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకోవడం వలన అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు.
- పుట్టింటి నుంచి ఆడపిల్ల పసుపు, కుంకుమ తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. ఎవరైతే పసుపు, కుంకుమలను తెచ్చుకుంటారో, వారు దీర్ఘకాలం సుమంగళిగా ఉంటారు. వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా సంతోషంగా ఉంటారు.
- పుట్టింటి నుంచి ఆడపిల్లలు ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వలన అదృష్టం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. సిరి సంపదలు కలుగుతాయి. ఏనుగు బొమ్మ చెక్కతో చేసినదైనా పర్వాలేదు లేదంటే లోహంతో తయారు చేసినదైనా పర్వాలేదు.
- పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు మట్టితో చేసిన కుండను అత్తవారింటికి తెచ్చుకోవడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. మట్టి కుండలు తెచ్చాక అందులో నీళ్లు పోసి, ఇంట్లో ఉన్న పిల్లలకు ఆ నీళ్లు ఇవ్వండి. ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఈ మట్టి కుండని ఉత్తరం వైపు పెట్టుకుంటే డబ్బు కొరత ఉండదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం