వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఎటువంటి ప్రతికూల శక్తి ఉన్నా సరే తొలగిపోతుంది. చాలామంది ఇంట్లో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలంటే, వాస్తు ప్రకారం అనుసరించడం మంచిది.
ప్రతీ రోజూ కూడా మంచి నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. నిద్ర సరిగ్గా లేనట్లయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఎలాంటి చిట్కాలని పాటించడం వలన హాయిగా నిద్ర పడుతుంది, ఎలా వాస్తు దోషాలు తొలగిపోతాయి వంటివి తెలుసుకుందాం.
మంచి నిద్రని పొందాలంటే మనం నిద్రపోయే గదిలో కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు కొన్ని ఉన్నాయి.
ఈ కారణాల వలన ప్రతికూల శక్తి, ప్రతికూల ఆలోచనలు కలుగుతాయి. నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. తికమకగా అనిపిస్తుంది. మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వాస్తు ప్రకారం మంచి నిద్రని పొందాలంటే కొన్ని వస్తువులు మంచం కింద లేకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు. మంచం కింద నుంచి చెప్పులు, మాసిన బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి లేకుండా చూసుకోండి. అనవసరమైన వాటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది. ఒకవేళ కనుక మంచం కింద ఇటువంటి వస్తువులు ఉన్నట్లయితే సరిగా నిద్ర పట్టదు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మంచి నిద్రను పొందడానికి తల దగ్గర ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చూసుకోవాలి. మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, చార్జర్లు, వాచీ లు వంటివి లేకుండా చూసుకోవాలి. ఇటువంటి వాటి వలన ఒత్తిడి కలుగుతుంది. వీటితో పాటుగా పుస్తకాలు, మందులు కూడా తల దగ్గర లేకుండా చూసుకోవాలి.
వాస్తు ప్రకారం, మంచి నిద్ర పొందడానికి, నైరుతి దిశ ఉత్తమం. అలాగే మీ మంచం గోడను తాకకుండా చూసుకోవాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.