Vinakaya chavithi 2024: వినాయక చవితి నాడు గణపతిని ప్రతిష్టించుకుంటున్నారా? ఈ పూజా సామాగ్రి తెచ్చుకోండి
మరో మూడు రోజుల్లో వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టించాలని అనుకుంటున్నారా? అయితే ఈ పూజా సామాగ్రి కూడ ఇంటికి తెచ్చి పెట్టుకోండి.
Vinakaya chavithi 2024:ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. పండుగకు ఇక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ రోజున చాలా మంది వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
ఈ రోజున ఇంట్లో వినాయకుడిని అందంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వారికి పూజలు, హారతి నిర్వహిస్తారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి నాడు గణేశుడు జన్మించాడని నమ్ముతారు. ఈ సంవత్సరం చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 03.01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 7వ తేదీ శనివారం సాయంత్రం 05.37 గంటలకు ముగుస్తుంది.
ఈ రోజు నుండి ఇంట్లో గణపతిని మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల పాటు ఉంచుకుంటారు. తర్వాత నిమజ్జనం చేస్తారు. అయితే అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. మోదకం, లడ్డూలు, దుర్వాలు వినాయకుని పూజలో ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనవి. ప్రతిరోజూ పూజ చేస్తున్నప్పుడు గణేశుడికి 21 దుర్వాలు సమర్పించండి.
వినాయక చవితి పూజా సామాగ్రి
మీరు కూడా గణేష్ చతుర్థి రోజున పూజ సామగ్రిని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ మేము మీకు ప్రాథమిక వస్తువుల జాబితాను అందిస్తున్నాము. వీటి ప్రకారం తెచ్చి పెట్టుకుంటే పూజకు ఎటువంటి లోటు లేకుండా చేసుకోవచ్చు.
పసుపు, కుంకుమ, పసుపు రంగు పువ్వులు, కొబ్బరికాయను ఉంచడానికి మీకు కలశం అవసరం. కర్పూరం, పవిత్ర దారం, నూతన వస్త్రాలు, గంధం, అక్షతం మొదలైనవి కూడా అవసరం. కలువ పువ్వులు, బంతి, చామంతి పూలు పెట్టుకోవాలి. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు శుభ్రమైన పీట లేదా చెక్క బల్లను ఏర్పాటు చేసుకోవాలి. దాని మీద కొత్త ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరుచుకోవాలి.
కొత్త వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించుకోవాలి. తమలపాకులు, లడ్డూలు, మోదకాలు ఉంచుకోవాలి. గణేశుడిని పూజించిన తర్వాత మోదకం, లడ్డూలను వినాయకుడికి సమర్పించాలి.
గణేశునికి దుర్వా గడ్డి ఖచ్చితంగా సమర్పిస్తారు. కొబ్బరి, కాలానుగుణ పండ్లను పూజ సమయంలో భగవంతునికి నైవేద్యంగా పెడతారు. ధూప కర్రలు, దీపాలు ఏర్పాటు చేసుకోవాలి. దీపం కోసం నెయ్యి సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. గణపతి పూజలో తప్పనిసరిగా 21 పత్రాలు ఉండాలి. అవి లేకుండా పూజ అసంపూర్ణంగా అనిపిస్తుంది. పూజ కోసం వాటిని ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి.
ఇవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్న తర్వాత వినాయకుడి పూజ మొదలు పెట్టాలి. తమ జీవితంలోని అడ్డంకులు తొలగించమని కోరుకుంటూ భక్తి శ్రద్దలతో పూజ చేసుకోవాలి. గణపతి అష్టోత్తరం, సంకటనాశన గణేశ స్తోత్రం, గణపతి సహస్ర నామం ఉన్న పుస్తకాలు పక్కన పెట్టుకోవాలి. వాటిని చదువుతూ పూజ చేసుకోవాలి. రుణ విమోచక గణపతి స్తోత్రం పారాయణం చేయాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీరు పూజ చేసేటప్పుడు ఉత్తర దిక్కు ఉండి పూజ చేయడం ఉత్తమం.
ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.