Yeti Sutakam: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది మొత్తం దీపారాధన చేయకూడదా? ఏటి సూతకంలో ఆలయాలకు వెళ్ళవచ్చా?
ఇంట్లో ఎవరైనా చనిపోతే, పూజ విషయంలో ఎలాంటి నియమాలని పాటించాలి?, ఎటువంటి పొరపాట్లు చేయకూడదు?, దీపారాధన చేయొచ్చా లేదా వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఎవరైనా చనిపోతే పూజ చేయవచ్చా?, దీపారాధన చేయవచ్చా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఇంట్లో ఎవరైనా చనిపోతే, పూజ విషయంలో ఎలాంటి నియమాలని పాటించాలి?, ఎటువంటి పొరపాట్లు చేయకూడదు?, దీపారాధన చేయొచ్చా లేదా వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
‘దీపం పరబ్రహ్మ స్వరూపం’. ప్రతీ రోజూ ప్రతీ ఇంట్లో కూడా దీపారాధన చేయాలి. వీలైతే ఉదయం, సాయంత్రం రెండు పూట్ల దీపారాధన చేయడం మంచిది. సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.
ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పొడవునా దీపారాధన చేయకూడదా?
ఇంట్లో ఎవరైనా చనిపోతే పండుగలు, ప్రత్యేక పూజలు చేసుకోకూడదు. కానీ దీపారాధన చెయ్యొచ్చు. దీపారాధన చేయకూడదని ఎలాంటి నియమం లేదు. రోజూ దీపారాధన చేసుకోవచ్చు.
కొంతమంది తెలియక దీపారాధన చేయడం మానేస్తారు. ఏడాది పొడవునా దీపారాధన చేయకూడదని అనుకుంటారు. కానీ నిజానికి శుద్ధి అయిన తర్వాత రోజు నుంచి యధావిధిగా దీపారాధన చేసుకోవచ్చు.
ఖచ్చితంగా దీపారాధన చేయండి
- శుద్ధి అయిపోయిన తర్వాత రోజు నుంచి రోజూ దీపారాధన చేయండి. ముఖ్యంగా పూజ గదిలో దీపారాధన చేయడం వలన చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుంది. ఎవరైనా శరీరం విడిచిపెట్టిన తర్వాత దీపం వెలిగిస్తే మరో అకాల మరణం రాకుండా ఉంటుంది. కనుక నిత్యం దీపారాధన చేయడం మంచిది.
- పూజ గదిలో తప్పక దీపారాధన చేయండి. కార్తీకమాసంలో వెలిగించే దీపాలను కూడా వెలిగిస్తే, ఆ దీపారాధన ఫలితం వలన చనిపోయిన వారి ఆత్మలకు మరింత పవిత్రత కలుగుతుంది.
- నరక బాధలు, యమ మార్గ బాధలు తగ్గుతాయి. దీపారాధన చేయడం వలన ఎటువంటి దోషాలు కలగవు.
ఏటి సూతకంలో పుణ్యక్షేత్రాలకి వెళ్లొచ్చా?
ఏటి సూతకంలో పుణ్యక్షేత్రాలకి వెళ్ళొచ్చా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది ఏటి సూతకం అంటే తల్లి లేదా తండ్రి ఎవరైనా చనిపోతే ఏడాది పాటు ఉండే సమయాన్ని ఏటి సూతకమని అంటారు. అయితే, ఈ ఏడాది సమయంలో దేవాలయాలకు వెళ్లడం తప్పు కాదు. దేవాలయాలకు వెళ్ళొచ్చు.
ఆలయానికి వెళ్ళొచ్చు కానీ ఆలయంలో సేవలో పాల్గొనడం వంటివి చేయకూడదు. ఉత్సవాలు చేయించడం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. పండుగలు కూడా చేసుకోకూడదు.
ఈ ఏడాది పొడవునా పుణ్య నదుల్లో స్నానమాచరించడం వంటివి కూడా చేయకూడదు. అస్తికా సంచయనం చేసినప్పుడు మాత్రం పుణ్యా నదుల్లో దిగడంలో తప్పు లేదు. ఆలయాలకు వెళ్లి మొక్కుబడులు చెల్లించుకోవడం, అర్చనలు చేయించుకోవడం వంటివి చేయకూడదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం