మీ జేబులో డబ్బు ఉండడం లేదా? పర్సుకు సంబంధించిన ఈ సింపుల్ పరిహారాన్ని పాటించండి!-if money does not stay these follow these simple remedies to get wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మీ జేబులో డబ్బు ఉండడం లేదా? పర్సుకు సంబంధించిన ఈ సింపుల్ పరిహారాన్ని పాటించండి!

మీ జేబులో డబ్బు ఉండడం లేదా? పర్సుకు సంబంధించిన ఈ సింపుల్ పరిహారాన్ని పాటించండి!

Peddinti Sravya HT Telugu

చాలామంది ఎంత డబ్బు సంపాదిస్తున్నప్పటికీ నెల ఆఖరికి వచ్చేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతుంది. మీకు కూడా వచ్చిన డబ్బు తిరిగి అలానే వెళ్ళిపోతోందా? అయితే కచ్చితంగా ఇలా చేసేటట్టు చూసుకోండి. ఈ పరిహారాన్ని పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

మీ జేబులో డబ్బు ఉండడం లేదా? పర్సుకు సంబంధించిన ఈ సింపుల్ పరిహారాన్ని పాటించండి (pinterest)

ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఏ బాధలు లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటారు. కానీ అబ్బా, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే కచ్చితంగా వీటిని ఫాలో అయ్యేటట్టు చూసుకోండి.

చాలామంది ఎంత డబ్బు సంపాదిస్తున్నప్పటికీ నెల ఆఖరికి వచ్చేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతుంది. మీకు కూడా వచ్చిన డబ్బు తిరిగి అలానే వెళ్ళిపోతోందా? అయితే కచ్చితంగా ఇలా చేసేటట్టు చూసుకోండి.

ఈ పరిహారాన్ని పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. డబ్బులు కూడా మీ వద్ద ఉంటాయి. ఎంత ఆదాయం వచ్చినా డబ్బులు మిగులుతాయి.

ఈ సులువైన, సమర్థవంతమైన పరిహారాలని పాటిస్తే ఆర్థిక ఇబ్బందులే ఉండవు

పర్సులో ఒక్క రూపాయి కూడా లేకుండా, డబ్బు మొత్తం ఖర్చు అయిపోతున్నట్లయితే ఈ చిన్న చిన్న పరిహారాలని పాటించండి. వీటిని పాటించడం వలన మీ వద్ద డబ్బు ఎప్పుడూ ఉంటుంది. డబ్బులు మీ వద్ద ఉండాలంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి.

ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ పరిహారాన్ని పాటించండి:

పసుపు రంగు శ్రేయస్సు, సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. పసుపుకి స్వచ్ఛతకు చిహ్నం. ధనియాలు సంపదను స్థిరంగా ఉంచుతాయి. ఒక పసుపు రంగు క్లాత్‌లో ఏడూ ధనియాలు, ఒక వెండి కాసు లేదా ఒక రూపాయి కాసు, కొద్దిగా పసుపు వేసి ఆ క్లాత్‌ని చుట్టండి. దీనిని పర్సులో ఉంచండి. ఇది ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని వ్యాపిస్తుంది. ఆర్థిక నష్టాలను కలగకుండా చేస్తుంది.

ఈ పొరపాట్లు చేయకండి:

  1. ఎప్పుడూ కూడా మీరు మీ పర్సుని శుభ్రంగా ఉంచుకోవాలి.
  2. ఎప్పటికప్పుడు పాత బిల్లులు, అనవసరమైన వాటిని పర్సు నుంచి తొలగించాలి.
  3. కొత్త పర్సు కొనేటప్పుడు, మొదటిసారి ఒకసారి పూజ గదిలో పెట్టి, ఆ తర్వాత అందులో డబ్బులు పెట్టండి.
  4. మీ పర్సుని ఎప్పుడూ మీ తలకింద లేదా దిండు కింద పెట్టకండి. దీని వలన చాలా నష్టం జరుగుతుంది.
  5. పైన చెప్పినట్టుగా పాటించడం వలన, ఆ సానుకూల శక్తి నెమ్మదిగా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బుకి కూడా లోటు ఉండదు. ఎక్కువ డబ్బుల్ని ఆదా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.