హిందూ మతంలో వారానికి ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. బుధవారం నాడు గణపతిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. బుధవారం ఎవరైతే భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆరాధిస్తారో, వారు విశేష ఫలితాన్ని పొందుతారు. అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి, విఘ్నాలు తొలగిపోతాయి.
బుధవారం నాడు ఉపవాసం ఉంటే మంచి జరుగుతుంది. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. బుధవారం నాడు ఉపవాసం ఉండడం వలన ఆ జాతకంలో బుధుడు స్థానాన్ని బలపరచుకోవచ్చు.
బుధవారం ఉపవాసం ఉండాలనుకుంటే, మీరు ఏదైనా నెలలో శుక్లపక్ష బుధవారాన్ని చూసుకుని అప్పటి నుండి ఉపవాసాన్ని మొదలు పెట్టొచ్చు. విశాఖ నక్షత్రం ఉన్న బుధవారం అయితే మరీ మంచిది. బుధవారం వ్రతం చేయాలనుకుంటే 7 లేదా 21 బుధవారాలు చేయాలి. వీటిని క్రమం తప్పకుండా చేయాలి. చివరి రోజు ఉద్యాపన ఉంటుంది. అయితే పితృపక్షంలో మాత్రం ఈ వ్రతాన్ని మొదలు పెట్టకూడదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.