గోవుని పూజిస్తే ఎంత పుణ్యమో తెలుసా? ఇలా ప్రదిక్షణలు చేస్తే ఇంతా అంతా ఫలితం కాదు!-how to worship gomatha check what benefits one can get ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గోవుని పూజిస్తే ఎంత పుణ్యమో తెలుసా? ఇలా ప్రదిక్షణలు చేస్తే ఇంతా అంతా ఫలితం కాదు!

గోవుని పూజిస్తే ఎంత పుణ్యమో తెలుసా? ఇలా ప్రదిక్షణలు చేస్తే ఇంతా అంతా ఫలితం కాదు!

HT Telugu Desk HT Telugu

గోవును మనం మాతగా పిలుచుకుంటాం. మన ఇంట ఎటువంటి శుభకార్యమైనా గోమాత ప్రస్తావన వచ్చి తీరుతుంది. గోవుని పూజిస్తే ఎంత పుణ్యమో తెలుసా? ఇలా ప్రదిక్షణలు చేస్తే ఇంతా అంతా ఫలితం కాదు. అంతటి గోమాత గొప్పతనాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గోవుని పూజిస్తే ఎంత పుణ్యమో తెలుసా? (pinterest)

గోవు మనందరికీ ఆరాధ్యదైవం. గోవుని నిత్యం ఏదో సందర్భంలో మనం పూజిస్తూనే ఉంటాం. గోవును మనం మాతగా పిలుచుకుంటాం. మన ఇంట ఎటువంటి శుభకార్యమైనా గోమాత ప్రస్తావన వచ్చి తీరుతుంది. అంతటి గోమాత గొప్పతనాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గోమాత గొప్పతనాన్ని తెలుసుకోండి

గోవు పాదాలు పితృదేవతలు. గొలసి తులసీమార్గాన వెలసిన వల జ్ఞానం. గంగ నాథనీడు ఉన్నాడు. గద ధారముంది. మొగము జ్యేష్ఠము. కన్నులు అగ్రదేవతలు. చెవులు శంఖనాదములు. మూపురం విష్ణుదేవుని బోలు. బొడ్డు తామర కమలాల బోలు. నడుము నారదుని బోలు.

పక్కలు పరమేశ్వరుని బోలు. పిక్కలు పిడుగంటిని బోలు. తోలు యముణ్ణి బోలు. తోక వింజామర బోలు. కరివి కామాక్షిని బోలు. పొదుగు పుండరీకాక్షుని బోలు. సన్ను కట్టు సప్తసాగరాలు. పాలు పంచామృతాలు. పంచామృతాలలో ఉన్న భాగ్యవతి. భాగ్యవతిలో ఉన్న గోమయం. గోమయంలో ఉన్న గోపాలకృష్ణమూర్తి వారు.

గోపాలకృష్ణమూర్తి వారి భార్య రుక్మిణీ దేవి. శ్రీరాముల వారి భార్య సీతా దేవి. ధర్మరాజు గారి భార్య ద్రౌపదీ దేవి. ఈశ్వరుని భార్య పార్వతీ దేవి. బ్రహ్మదేవుని భార్య సరస్వతీ దేవి.

గోవుని పూజిస్తే ఎంత పుణ్యమో తెలుసా?

వీరంతా కొలువై కూర్చుండగా, శ్రీకృష్ణమూర్తి వారిని స్త్రీలు చేసిన పాపం ఎలా పోవునయ్యా? అని అడిగితే.. ఎరిగి చేసిన పాపం, ఎరక్క చేసిన పాపం, తల్లిదండ్రులను దూషించిన పాపం, అత్తమామలను నిందించిన దోషం, పురుషుడిని నిందించిన దోషం, పుత్రులను ఎడబాపిన పాపం, అంటుముట్టు ఇంట కలిపిన పాపం, ఆడపిల్లని అమ్మిన దోషం. ఇన్ని దోషాలు ఒకసారి గోవుని వర్ణిస్తే పోవునని చెప్పెను అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గోవుని వర్ణించిన వనిత వస్తోంది. వజ్రతుండి పురుగులు ఏరించండి. యమకింకరులను విసిరించండి. యమద్వారములు మూయించండి. స్వర్గద్వారములు తెరిపించండి. సన్మార్గియైన స్త్రీ వస్తోంది. తనువు విడిచి కవి వస్త్రాలు ధరించి వస్తోంది. పొద్దున్న లేచి ఒకసారి గోవుని పూజిస్తే, కాశీలో ముమ్మారు స్నానం చేసినంత పుణ్యం.

మధ్యాహ్నకాలాన గోవుని పూజిస్తే, అగ్నివంటి కష్టములు, కొండవంటి ఆపదలు లేవని, సాయంత్ర కాలాన గోవుని పూజిస్తే, కోటిదేవాలయములలో దీపారాధన చేసినంత ఫలితమని చెప్పెను. గోవు ప్రణవ సమయమున, తవ్వెడు బియ్యము, డబ్బు ఒడిలో పోసుకుని ముమ్మారు ప్రదక్షిణ చేస్తే, ఇంతా అంతా ఫలితం కాదని శ్రీకృష్ణమూర్తి వారు చెప్పెను అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.