Negative Energies at Home: ఇంట్లో నెగటివ్ ఎనర్జీని సింపుల్‌గా ఇలా తగ్గించుకోండి
Vastu Tips: మనం చాలా సార్లు తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు ఇంట్లో చేస్తుంటాం. దాంతో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంటుంది. కాబట్టి, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.
చాలా సార్లు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరగడం వల్ల అది మన ఆర్థిక పరిస్థితిపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం ఒక్క ఆర్థికంగానే కాదు వృత్తిలోనూ సమస్యలతో పాటు ఆరోగ్యంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మనం తెలిసో తెలియకో చాలా సందర్భాల్లో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయి. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఈ వాస్తు చిట్కాలను ప్రయత్నించండి
ఇంటి ప్రతికూల శక్తిని తొలగించడానికి ప్రతిరోజూ దీపం వెలిగించి, శంఖం ఊదడంతో పాటు గంటని కూడా కొట్టండి. సాయంత్రం వేళ భజన కీర్తన చేయడం వల్ల కూడా నెగెటివిటీ తొలగిపోతుంది. పూజ పూర్తయిన తర్వాత శంఖంలో పోసిన నీటిని ఇల్లంతా చల్లడం శుభప్రదంగా భావిస్తారు.
శుభ్రత
ఇంట్లో దుమ్ము, ధూళి, మట్టి లేదా సాలెపురుగు గూడు వంటివి నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందువల్ల ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఇంట్లో సాలె పురుగుల గూడు ఉంటే మీ ఖర్చులు పెరుగుతాయని చెబుతారు.
సూర్య భగవానుడికి అర్ఘ్యం
సూర్యోదయం వేళ ఆ సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం వల్ల దోషాలు తొలగిపోతాయని నమ్మకం. నీళ్ళు సమర్పించే విధానానికి (అర్ఘ్యం) ఆనాది నుంచి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదయాన్నే సూర్యుడి కిరణాలు శరీరం మీద పడటం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయి. సూర్యభగవానుడి ఆశీస్సులు మీపై ఉంటే జీవితంలో ఐశ్వర్యం, సంపద, గౌరవం ఎప్పుడూ తగ్గవు.
మీ జీవితంలో విలాసాలు, ఆశీర్వాదాలను పెంచడానికి సూర్యభగవానుడికి ప్రతిరోజూ నీటిని సమర్పించండి. సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి రాగి చెంబులో ఎరుపు రంగు పూలు, నువ్వులు, అక్షింతలు వేసి అర్ఘ్యం సమర్పించండి.
దీపం వెలిగించండి
భగవంతుడిని పూజించడానికి ప్రతిరోజూ ఇంట్లో నెయ్యి దీపం వెలిగించడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించండి. కర్పూరం వెలిగించడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా తొలగిపోతుంది.
టాపిక్