ఇంటి సుఖసంతోషాల విషయంలో పరిశుభ్రత చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇంట్లో మురికి ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. దీని వల్ల వ్యక్తి జీవితంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితి కూడా రావచ్చు. ఇంట్లో చెత్తను ఊడవటానికి ఉపయోగించే చీపురుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చీపురును హిందువులు లక్ష్మీ దేవిలా భావిస్తారు. అలాగే ఫెంగ్ షుయీ కూడా చీపురుకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో చీపురును ఉంచేందుకు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి. పాదాలకు చీపురును ఎప్పుడూ తాకనివ్వకూడదు. అంతేకాదు.. చీపురును సరైన దిశలో, సరైన మార్గంలో ఉంచడం కూడా అవసరమని భావిస్తారు. చీపురు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అది పేదరికానికి దారితీస్తుందని కూడా ఫెంగ్ షూయిలో పేర్కొన్నారు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో చీపురును ఎలా ఉంచాలో తెలుసుకుందాం.