Shattila Ekadashi: షట్తిల ఏకాదశి నాడు విష్ణువు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఈరోజు వీటిని తినకూడదు.. ఉపవాస నియమాలు ఇవే
Shattila Ekadashi: ఈసారి షట్తిల ఏకాదశి జనవరి 25న వచ్చింది. షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన శ్రీహరి ఆశీస్సులు కలుగుతాయి, కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు. మతపండితులు చెప్పిన దాని ప్రకారం, ఈరోజు ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హిందువులు షట్తిల ఏకాదశి నాడు మహావిష్ణువుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. ఈ ఏకాదశికి గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి విశ్వానికి అధిపతి అయినటువంటి విష్ణువుని పూజించడానికి అంకితం చేయబడింది. ఈసారి షట్తిల ఏకాదశి జనవరి 25న వచ్చింది. షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన శ్రీహరి ఆశీస్సులు కలుగుతాయి, కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు.

మతపండితులు చెప్పిన దాని ప్రకారం, ఈరోజు ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ నియమాలు పాటిస్తే పుణ్యం వస్తుంది. ఉపవాసం కలిగిన ఫలితం దక్కుతుంది. అదే ఆ నియమాలని ఉల్లంఘించినట్లయితే పుణ్య ప్రయోజనాలను పొందలేరు.
షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు:
పండితుల చెప్పిన దాని ప్రకారం, ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామున స్నానం చేసి తగు క్రతువులతో మహావిష్ణువుని ఆరాధించాలి. అలాగే పండ్లు, పూలు వంటి ఆహార పదార్థాలని సమర్పించాలి. అలాగే ఈ రోజు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. 'త్వతీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. గృహాణ సముఖో భుత్వ ప్రసిద్ద పరమేశ్వర' ఈ మంత్రాన్ని పఠిస్తే విష్ణువు సంతోషం కలుగుతారు. ఇలా ఈ విధంగా పూజ చేసి, ఉపవాస దీక్షను విరమిస్తే కావాల్సిన వరాన్ని విష్ణువు మనకి అందిస్తారు.
షట్తిల ఏకాదశి నాడు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు?
- షట్తిల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడంతో పాటుగా మహావిష్ణువుని ఆరాధించాలి. అయితే, కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
- ఈరోజు తామసిక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
- ఉల్లి, వెల్లుల్లి, మసాలా పదార్థాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
- అలాగే మాంసం, మద్యం, మత్తు పదార్థాలని తీసుకోకూడదు.
- ఉపవాసం చేయకపోయినా వీటికి దూరంగా ఉంటే మంచిది.
- ఉపవాసం ఉండేవారు ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. పాలు, పండ్లు వంటివి మాత్రమే తీసుకోవాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం